ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

WATER WORKERS: తాగునీటి కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ABN, Publish Date - Sep 03 , 2024 | 12:02 AM

తాగునీటి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఐఎ్‌ఫటీయూ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర డిమాండ్‌ చేశారు. బకాయి వేతనాల కోసం కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారానికి 12వ రోజుకు చేరింది. సమ్మెకు ఐఎ్‌ఫటీయూ నాయకులు మద్దతునిచ్చారు.

Villagers supporting the strike of drinking water workers in Kallur

గార్లదిన్నె, సెప్టెంబరు 2: తాగునీటి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఐఎ్‌ఫటీయూ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర డిమాండ్‌ చేశారు. బకాయి వేతనాల కోసం కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారానికి 12వ రోజుకు చేరింది. సమ్మెకు ఐఎ్‌ఫటీయూ నాయకులు మద్దతునిచ్చారు. ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో ఎంతోమంది ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు. సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, పటాన బాషా, తాగునీటి కార్మికులు నాగభూషణం, మల్లరాయుడు, శ్రీనివాసులు, జనార్ధన, సాంబశివ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నార్పల: సత్యసాయి కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కార్మికులు పేర్కొన్నారు. బీ పప్పురు పంప్‌ హౌస్‌ వద్ద సత్యసాయి కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం 12వ రోజుకు చేరింది. కార్మికులు అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నాగభూషణ, అంకన్న, పుల్లనాయుడు, శరతబాబు, శ్రీరాములు, చంద్రమోహన, ఈశ్వరయ్య, వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 12:02 AM

Advertising
Advertising