14న మహిళా ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు
ABN, Publish Date - Sep 07 , 2024 | 12:04 AM
యూటీఎఫ్ స్వర్ణత్సోవాల్లో భాగంగా పట్టణంలోని జిల్లాపరిషత బాలికల ఉన్నతపాఠశాల ఆవరణంలో ఈనెల 14న మహిళ ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా కోశాధికారి, కార్యదర్శులు శ్రీనివాసులు, తాహేర్‌వలీ శుక్రవారం తెలిపారు.
కదిరి అర్బన, సెప్టెంబరు 6 : యూటీఎఫ్ స్వర్ణత్సోవాల్లో భాగంగా పట్టణంలోని జిల్లాపరిషత బాలికల ఉన్నతపాఠశాల ఆవరణంలో ఈనెల 14న మహిళ ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా కోశాధికారి, కార్యదర్శులు శ్రీనివాసులు, తాహేర్‌వలీ శుక్రవారం తెలిపారు. అందుకు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరించారు. మహిళ ఉపాధ్యాయులకు త్రోబాల్, షాట్‌పుట్, టెన్నికాయింట్, స్పీడ్ వాక్, షటీల్ తదితర క్రీడలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు యశోద, సుజాత, ఉపాధ్యాయులు రాణి, లక్ష్మీ, ప్రత్యూషా పాల్గొన్నారు.
Updated Date - Sep 07 , 2024 | 12:04 AM