ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

sports విద్యార్థినులకు క్రీడా పోటీలు ప్రారంభం

ABN, Publish Date - Nov 04 , 2024 | 12:09 AM

పట్టణంలోని శంకరానందగిరిస్వామి డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎస్‌కే యూనివర్శిటీ ఇంటర్‌ కాలేజీ మహిళల టోర్నమెంట్‌ 2024-25 పేరిట విద్యార్థినులకు క్రీడా పోటీలు ప్రారంభించారు.

గుంతకల్లుటౌన, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శంకరానందగిరిస్వామి డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎస్‌కే యూనివర్శిటీ ఇంటర్‌ కాలేజీ మహిళల టోర్నమెంట్‌ 2024-25 పేరిట విద్యార్థినులకు క్రీడా పోటీలు ప్రారంభించారు.


ముఖ్యఅతిథులుగా కళాశాల కరెస్పాండెంట్‌ కేసీ హరికుమార్‌, ఎస్‌కే యూనివర్శిటీ రెక్టార్‌ వెంకటనాయుడు, యూనివర్శిటీ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రెటరీ బీ జెస్సీ హాజరయ్యారు. కబడ్డీ, ఖోఖో, బాస్కెట్‌బాల్‌, బాల్‌బాడ్మింటన, వాలీబాల్‌, షటిల్‌, చెస్‌, టెబుల్‌టెన్నిస్‌ పోటీలకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 20 కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండా, స్పోర్ట్స్‌ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థినులు మార్చ్‌పాస్ట్‌ నిర్వహించారు. అనంతరం ఎస్‌కే యూనివర్శిటీ స్పోర్ట్స్‌ కార్యదర్శి జెస్సీ, కరెస్పాండెంట్‌ కేసీ హరికుమార్‌ ఖోఖో, వాలీబాల్‌, బ్యాడ్మింటన పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల అకాడమిక్‌ డైరెక్టర్‌ గోపాల్‌, ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వరప్రసాద్‌, అధ్యాపకులు, వివిధ కళాశాలల పీడీలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Nov 04 , 2024 | 12:09 AM