ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

railway bridges రైల్వే బ్రిడ్జిల నిర్మాణం త్వరగా ప్రారంభించండి: ఎమ్మెల్యే కాలవ

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:43 AM

పట్టణంలో రైల్వే క్రాసింగ్‌ల వద్ద మధ్యలో నిలిచిపోయిన బ్రిడ్జిల నిర్మాణ పనులను 2025 మార్చి నాటికి తిరి గి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు.

రాయదుర్గం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): పట్టణంలో రైల్వే క్రాసింగ్‌ల వద్ద మధ్యలో నిలిచిపోయిన బ్రిడ్జిల నిర్మాణ పనులను 2025 మార్చి నాటికి తిరి గి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు.


పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో గురువారం ఆయన రైల్వే, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి మాట్లాడారు. త్వరితగతిన పనులు ప్రారంభించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాల్సిందిగా కోరారు. ట్రాఫిక్‌ అంతరాయం ఎక్కువగా ఉన్నందున రైల్వే బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తి చేసేందుకు రైల్వే అధికారులకు సహకరించాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. తొలుత వారందరూ కలిసి రైల్వే బ్రిడ్జిలను సందర్శించారు. గొల్లపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే గేట్‌ వద్ద కూడా బ్రిడ్జి నిర్మాణానికి రూ. 25 కోట్లు మంజూరైనట్లు రైల్వే ఎక్సెన జగదీశసాయి తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ జే ప్రసాద్‌రెడ్డి, డీఈ రవిశంకర్‌రెడ్డి, ఏఈ నాగేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Nov 08 , 2024 | 12:43 AM