AP ELECTIONS : సా్ట్రంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఉండాలి
ABN, Publish Date - May 18 , 2024 | 12:40 AM
ఈవీఎంలు భద్రపరిచిన సా్ట్రంగ్‌రూమ్స్ వద్ద పటిష్ట భద్రత కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీ నా జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. విజయవాడ నుంచి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వినోద్ కుమార్, జేసీ కేతనగార్గ్, నగరపాలిక కమిషనర్ మేఘస్వరూప్, డీఆర్వో రామకృష్ణారెడ్డి, ఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖే్‌షకుమార్ మీనా మాట్లాడుతూ, సా్ట్రంగ్ ...
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా
అనంతపురం టౌన, మే 17: ఈవీఎంలు భద్రపరిచిన సా్ట్రంగ్‌రూమ్స్ వద్ద పటిష్ట భద్రత కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీ నా జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. విజయవాడ నుంచి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వినోద్ కుమార్, జేసీ కేతనగార్గ్, నగరపాలిక కమిషనర్ మేఘస్వరూప్, డీఆర్వో రామకృష్ణారెడ్డి, ఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖే్‌షకుమార్ మీనా మాట్లాడుతూ, సా్ట్రంగ్ రూమ్స్ వద్ద నిబంధనల మేరకు భద్రత కొనసాగించాలని సూచించారు. 144
సెక్షనను పటిష్టంగా అమలుచేయాలని అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీలకు, అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. కౌంటింగ్ ముగిసే వరకు ఎక్కడా నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడవద్దని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 18 , 2024 | 12:40 AM