ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HUMAN RIGHTS FORUM: విద్యార్థులకు చదువు భారం కాకూడదు

ABN, Publish Date - Aug 05 , 2024 | 11:34 PM

విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే చదువులు ప్రభుత్వాల చర్యలతో వారికి భారంగా పరిణమిస్తున్నాయని, దీనికి నివారించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర సభ్యులు చంద్రశేఖర్‌ అన్నారు.

Speaking human rights Leader Chandrasekhar

అనంతపురం సెంట్రల్‌, ఆగస్టు 5: విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే చదువులు ప్రభుత్వాల చర్యలతో వారికి భారంగా పరిణమిస్తున్నాయని, దీనికి నివారించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర సభ్యులు చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం ఏఐఎ్‌సఏ ఆధ్వర్యంలో ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు స్టూడెంట్స్‌ మార్చ్‌ను నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశానికి చంద్రశేఖర్‌తోపాటు సీపీఐఎంఎల్‌ టీఎ్‌సవలి, ఏఐఎ్‌సఏ అధ్యక్షుడు వేమన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఉన్నత విద్యాకోర్సుల ప్రవేశాలకు జాతీయస్థాయిలో నేషనల్‌ టెస్ట్‌ ఏజెన్సీ(ఎనటీఏ) సంస్థ పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. ఈ ప్రక్రియలో పేపర్లను లీక్‌చేసి ప్రతిభగల విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్నారని మం డిపడ్డారు. ఎనటీఏను రద్దుచేసి నీట్‌, జేఈఈ వంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షలను స్థానికంగా ఆయా రాష్ర్టాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నాయకులు పరశురాం, సుజాత, శివకుమార్‌, బాలకృష్ణ, రాజునాయక్‌, వంశీకృష్ణ, హేమంత, మహేష్‌, అరవింద్‌, రమణ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 11:34 PM

Advertising
Advertising
<