ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SURVEY : సరిహద్దులో గనుల సర్వే

ABN, Publish Date - May 31 , 2024 | 12:29 AM

ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ముడి ఇనుప గనుల లీజు ప్రాంతాల హద్దులను గుర్తించేందుకు కేంద్ర బృందం గురువారం సర్వే ప్రారంభించింది. మైనింగ్‌ జరుగుతున్న కొండల్లో వారంరోజుల పాటు సర్వే నిర్వహిస్తామని ఈ బృందం తెలిపింది. కర్ణాటకలోని టుముటి, విఠలాపురం సరిహద్దుల్లో ఏడు మైనింగ్‌ లీజులు ఉన్నాయి. వాటి లీజు కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో లీజ్‌ రెన్యువల్‌ చేసేందుకు ఎనఐటీకే సీనియర్‌ ప్రొఫెసర్‌ సూరత హర్షవర్ధన నేతృత్వంలోని బృందం సర్వే చేస్తోంది. ఏడు మైనింగ్‌ లీజులు ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి ఆనుకుని ఉండడంతో ఆంధ్ర, కర్ణాటక అధికారులు ...

A central team conducting the survey

మైనింగ్‌ లీజుల రెన్యువల్‌ కోసం..

రాయదుర్గం, మే 30: ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ముడి ఇనుప గనుల లీజు ప్రాంతాల హద్దులను గుర్తించేందుకు కేంద్ర బృందం గురువారం సర్వే ప్రారంభించింది. మైనింగ్‌ జరుగుతున్న కొండల్లో వారంరోజుల పాటు సర్వే నిర్వహిస్తామని ఈ బృందం తెలిపింది. కర్ణాటకలోని టుముటి, విఠలాపురం సరిహద్దుల్లో ఏడు మైనింగ్‌ లీజులు ఉన్నాయి. వాటి లీజు కాలపరిమితి త్వరలో ముగియనుంది. దీంతో లీజ్‌ రెన్యువల్‌ చేసేందుకు ఎనఐటీకే సీనియర్‌ ప్రొఫెసర్‌ సూరత హర్షవర్ధన నేతృత్వంలోని బృందం సర్వే చేస్తోంది. ఏడు మైనింగ్‌ లీజులు ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి ఆనుకుని ఉండడంతో ఆంధ్ర, కర్ణాటక అధికారులు


సర్వేకి హాజరయ్యారు. వీరితో పాటు లీజు పొందిన గనుల యజమానులు కూడా హాజరయ్యారు. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం మలపనగుడి, సిద్ధాపురం కొండ ప్రాంతాలకు లీజు గనులు ఆనుకుని ఉన్నాయి. దీంతో రెండు రాషా్ట్రల మధ్య వివాదం తలెత్తకుండా సర్వే హద్దులను, సరిహద్దు రాళ్లను పరిశీలించారు. ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం కూడా ఉండడంతో లీజు పొందిన ప్రాంతాల్లో జరిపిన తవ్వకాలను కూడా పరిశీలించి, సర్వే నిర్వహిస్తున్నారు. చిత్రపటాల ఆధారంగా కొలతలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఏపీ సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రూప్లానాయక్‌, కర్ణాటక సీనియర్‌ జియాలజిస్టు చందు, మైనింగ్‌ ఏడీ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 31 , 2024 | 12:29 AM

Advertising
Advertising