COUNCIL MEET: అక్రమ లేఔట్లపై చర్యలు తీసుకోండి
ABN, Publish Date - Jun 27 , 2024 | 11:53 PM
అనుమతిలేని లేఔట్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. నగర పంచాయతీ కమిషనర్‌కు సూచించారు. లేఔట్లను క్రమబద్ధీకరించడం ద్వారా ఆదాయం పెంచాలన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
మడకశిర, జూన 27: అనుమతిలేని లేఔట్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. నగర పంచాయతీ కమిషనర్‌కు సూచించారు. లేఔట్లను క్రమబద్ధీకరించడం ద్వారా ఆదాయం పెంచాలన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅథితిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో పరిశుభ్రతకు పెద్దపీట వేసి, ఆదర్శ నగరపంచాయతీగా తీర్చిదిద్దాలని సూచించారు. రెండు వేల మంది ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకుంటే ఎందుకు అనుమతులు ఇవ్వలేదని ప్రశ్నించారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ అనుమతులు ఇవ్వాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన లక్ష్మీనరసమ్మ, కమిషనర్ రంగస్వామి, సభ్యులు పాల్గొన్నారు.
ఇష్టారాజ్యంగా సుంకం వసూలు చేయడం దారుణం
మడకశిరటౌన: చిరువ్యాపుల నుంచి ఇష్టారాజ్యంగా సుంకం వసూలు చేయడం దారుణమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు. అధిక సుంకం వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారంలోపు మార్కెట్‌కు అడ్డంగా ఉన్న రేకుల షెడ్లను తొలగించాలన్నారు. అనంతరం మడకశిర నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసుకు ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేసిందన్నారు. భవన నిర్మాణం 80 శాతం పూర్తయినా వైసీపీ ప్రభుత్వంలో మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయలేకపోయిందన్నారు.
Updated Date - Jun 27 , 2024 | 11:53 PM