ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

VOTE : వలస ఓటర్లపై గురి

ABN, Publish Date - May 04 , 2024 | 11:35 PM

రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ప్రధాన పార్టీలకు కీలకం. దీంతో ప్రతి ఓటు అభ్యర్థికి అవసరం కావడంతో ఏ ఒక్క ఓటరును వదులుకోకుండా వారిపై అభ్యర్థులు గురిపెట్టారు. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతుంటే రాజకీయ నేతలతో పాటు జనాల్లో ఉత్కంఠ పెరిగింది. అందుకే వలస ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తు న్నారు.

రప్పించేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు

పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన నాయకులు

పోలింగ్‌ రోజున వాహనాలు, భోజనాలు సైతం

బంధువుల ద్వారా వివరాల సేకరణ

ఓటును కీలకంగా భావిస్తున్న అభ్యర్థులు

హిందూపురం, మే 4 : రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ప్రధాన పార్టీలకు కీలకం. దీంతో ప్రతి ఓటు అభ్యర్థికి అవసరం కావడంతో ఏ ఒక్క ఓటరును వదులుకోకుండా వారిపై అభ్యర్థులు గురిపెట్టారు. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతుంటే రాజకీయ నేతలతో పాటు జనాల్లో ఉత్కంఠ పెరిగింది. అందుకే వలస ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తు న్నారు. హిందూపురం, మడకశిర నియోజకవర్గాల నుంచి సుమారు 50వేల మందిదాకా వలస పోయారు. వారంతా కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్రల కు జీవనోపాధికి వెళ్లారు. వారిని పోలింగ్‌ రోజున తీసుకొచ్చేందుకు అభ్యర్థు లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ బాధ్యతలను ద్వితీయ శ్రేణి నాయ కులకు అప్పగించారు. వారు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఓ వైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా సాగుతుండగా బయటి ప్రాంత ఓటర్లును ఎలా రప్పించాలి అనేదానిపై దృష్టి పెట్టారు.


ప్రత్యేక బృందాల ఏర్పాటు

పోలింగ్‌ రోజున వలస ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు ఫోకస్‌ పెంచారు. అభ్యర్థుల వద్ద నమ్మకంగా ఉన్న ద్వితీయశ్రేణి నాయకులకు వల స ఓటర్లను రప్పించే బాధ్యతలు అప్పగించారు. వారు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి వలస ఓటర్ల వద్దకు పంపుతున్నారు. అదికూడా సామాజిక వర్గాల వారీగా బృందాలు ఏర్పాటుచేసి ఆయా సామాజిక వర్గ ఓటర్లను కలిసేందుకు వ్యూహరచన చేశారు. ఇప్పటికే ఓ రౌండ్‌ వెళ్లివచ్చారు. అయితే ఒక పార్టీ నాయకులు రెండు రోజులుగా వలస ఓటర్లపై దృిష్టిపెట్టారు. వా రికి సంబందించిన నాయకులు కర్ణాటకలోని బెంగళూరు, చిక్కబళ్లాపురం, కోలార్‌, తుమ కూరు, మైసూరు, బళ్లారి, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడికి వెళ్లి వారికి ఒక్కసారి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించి, నమూనా బ్యాలెట్‌ పత్రాలు అందజేస్తున్నారు. ఇంకొం దరి వివరాలు, ఫోననంబర్లు ఆరాతీస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 13న జరిగే పోలింగ్‌కు వలస ఓటర్లను రప్పించే బాధ్యతను ప్రత్యేకంగా తీసుకోగా ఆ రోజు వారు వచ్చేం దుకు వాహనాల ఏర్పాటు, వారి కి భోజనాలు, తదితర సదుపా యాలపై ఇప్పటికే కొంతమందికి ఆ పనులు అప్పజెప్పారు. పోలింగ్‌ సోమవారం జరుగనుం డటంతో శనివారం సాయంత్రాని కే వలస ఓటర్లు స్వగ్రామాలకు వచ్చేందుకు వాహనాలు ఏర్పా టు చేశారు. పది మంది లోగా ఉంటే కారు, 30మంది లోపు ఉంటే మినీబస్సు, అంతకంటే ఎక్కువ ఉంటే బస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వారు పోలింగ్‌ రోజున వస్తే భోజనాలు, ఇతర వసతులను స్థానికంగా సిద్దం చేస్తున్నారు.

బంధువుల ద్వారా వివరాల సేకరణ

ఇదిలా ఉంటే వలస ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపై బూత ఇనచార్జ్‌లు దృష్టిసారించారు. వలస ఓటర్లను గుర్తించి వారి బంధువుల వద్దకు వెళ్లి ఎక్కడ జీవనోపాధికి వెళ్లారో తెలుసుకుంటున్నారు. వారి ఫోన నంబర్లు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అధికార పార్టీలో ఓ ప్రత్యేక టీమ్‌ ఇందుకోసం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. వారు ఎక్కడున్నారు పోలింగ్‌కు వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనేదాన్ని బంధువుల ద్వారా ఆరాతీస్తున్నారు.


వలస ఓటర్ల చూపు.. ఎటువైపు?

సొంతూళ్లలో భూములు, పనులు లేనివారు గతంలో అధికంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కానీ ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో అరాచకాలు, అఘాయిత్యాలు, భూదందాలు అధికం కావడంతో చాలా మంది చదువుకు న్న విద్యార్థులకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల చేతినిండా పని దొరకక వలస వెళ్లినవారే చాలామంది ఉన్నారు. అదేవిధంగా అధికార పార్టీ నాయ కుల బెదిరింపులు తాళలేక భయబ్రాంతులకు గురై పక్కరాష్ట్రాలకు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకి వ్యతి రేకంగా ఓటువేసే వలస ఓటర్లు అధికంగా ఉన్నట్లు ఇటీవల ఓ సర్వేసంస్థ పేర్కొంది. దీంతో ఎలాగైనా వలస ఓటర్లను రాకుండా చేయాలని వైసీపీ కు యుక్తులు పన్నుతోంది. వారి బంఽధువుల ఇళ్లవద్దకు వెళ్లి ఓటుకు కావాలంటే డబ్బు ఇస్తాంకానీ వారిని ఇక్కడికి ఓటింగ్‌కు రాకుండా చూడాలంటూ చెబుతుండడం విశేషం. దీనినిబట్టి వలస ఓటర్లు అంటే అధికార వైసీపీ వారికి ఎంత భయం ఉందో ఇట్టే అర్థం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఓటును కీలకంగా భావించి వలస ఓటర్లపై గురిపెట్టారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 04 , 2024 | 11:35 PM

Advertising
Advertising