DEO: విద్యాశాఖ సిబ్బందిపై దాడి హేయం
ABN, Publish Date - Sep 12 , 2024 | 11:56 PM
కడపలో జిల్లా విద్యాశాఖ సిబ్బందిపై కొందరు ఉపాధ్యాయ సంఘం నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఖండించారు. గురువారం డీఈఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు.
అనంతపురం విద్య, సెప్టెంబరు 12: కడపలో జిల్లా విద్యాశాఖ సిబ్బందిపై కొందరు ఉపాధ్యాయ సంఘం నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఖండించారు. గురువారం డీఈఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. ఏడీలు, సూపరింటెండెంట్లు మాట్లాడుతూ.. 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డుల విషయంలో సీనియర్ అసిస్టెంట్‌పై ఎస్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు దాడి చేశారని తెలిపారు. ఉద్యోగులపై దాడి చేయడం సబబుకాదన్నారు. మంచి ఉపాధ్యాయులకు, 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల సర్వీసు ఉన్న టీచర్లను కమిటీ సిఫార్సుల మేరకు అవార్డులకు ఎంపిక చేస్తారన్నారు. సంఘాల నాయకులు చెప్పిన వాళ్లకే అవార్డులు ఇవ్వాలన్న దోరణితో దాడి చేయడం దుర్మార్గం అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏడీ క్రిష్ణయ్య, సూపరింటెండెంట్లు ఆదినారాయణ, లక్ష్మినారాయణ, సీనియర్ అసిస్టెంట్లుపార్థసారథి, జిలాన పాల్గొన్నారు.
Updated Date - Sep 12 , 2024 | 11:56 PM