BOY MISSING: 12 గంటలలోపే బాలుడి మిస్సింగ్ కేసు ఛేదింపు
ABN, Publish Date - Aug 31 , 2024 | 11:42 PM
అనంతపురం రైల్వే స్టేషనలో శుక్రవారం అదృశ్యమైన బాలుడి ఆచూకీని రైల్వే పోలీసులు 12 గంటలలోపే ఛేదించారు. బాలుడు గానయోగిని తల్లిదండ్రుల చెంతకు చేర్చా రు.
అనంతపురం న్యూటౌన, ఆగస్టు 31: అనంతపురం రైల్వే స్టేషనలో శుక్రవారం అదృశ్యమైన బాలుడి ఆచూకీని రైల్వే పోలీసులు 12 గంటలలోపే ఛేదించారు. బాలుడు గానయోగిని తల్లిదండ్రుల చెంతకు చేర్చా రు. రైల్వే పోలీసులు వెల్లడించిన మేరకు ప్రకాష్, శారదాబాయిల మూ డేళ్ల కుమారుడు గానయోగి, ఏడు నెలల కూతురుతో కలిసి శుక్రవారం రాయచూర్ నుంచి బెంగళూరులో కులీ పనుల నిమిత్తం రైలు నెంబర్ 11301 ఉద్యాన ఎక్స్‌ప్రె్‌సలో రాయచూరు నుంచి జనరల్ బోగీలో బయలు దేరారు. మధ్యలో ప్రకాష్ కొడుకు గానయోగిని పక్కన కూర్చోబెట్టుకొని కునుకు తీశాడు. అదే రైల్లోనే పక్కనే ప్రయాణిస్తున్న గుల్బర్గకు చెందిన జంట రూపేష్, కుసుమ దీన్ని గమనించి గానయోగిని అపహరించి అనంతపురం రైల్వే స్టేషనలో దిగి తిరిగి బస్సు ప్రయాణం ద్వారా గుల్బర్గకు చేరారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసునమోదు చేసుకొని డీఎస్పీ అబ్దుల్ అజీజ్, సీఐ నాగరాజు పర్యవేక్షణలో బాలుడి ఆచూకీ కోసం గాలించారు. లభించిన ఆధారాల మేరకు జీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో గాలిస్తుండగా రాయచూరు ఆర్‌పీఏఫ్ సీఐ సహకారంతో గుల్బర్గకు వెళుతున్న జంటతో పాటు బాలుడిని గుర్తించి రాయచూరు స్టేషనలో అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న అనంతపురం సిబ్బంది జంటతో పాటు బాలుడి తల్లిదండ్రులను స్టేషనకు పలిపించి బాలున్ని అప్పగించారు. జంటపై బాలుడి కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గాలింపులో ఆర్‌పీఎఫ్ సీఐ రవిప్రకాష్, ఏఎ్‌సఐ రఫీ, జీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్స్ శ్రీరాములు, దామోదర్, కానిస్టేబుల్స్ భాస్కర్, నరేష్, సురేష్ పాల్గొన్నారు.
Updated Date - Aug 31 , 2024 | 11:43 PM