ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ANANTAPUR CLUB: పారదర్శకంగా క్లబ్‌ నిర్వహించాలి

ABN, Publish Date - Jul 30 , 2024 | 12:03 AM

అనంతపూర్‌ క్లబ్‌లో ఎటువంటి వివాదాలు, రాజకీయ, కుల, మతాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ సూచించారు. 78ఏళ్ల చరిత్ర కలిగిన అనంతపూర్‌ క్లబ్‌ను సోమవారం ఆయన సందర్శించారు.

Anantapur club members welcoming MLA

అనంతపురం క్లాక్‌టవర్‌, జూలై 29: అనంతపూర్‌ క్లబ్‌లో ఎటువంటి వివాదాలు, రాజకీయ, కుల, మతాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ సూచించారు. 78ఏళ్ల చరిత్ర కలిగిన అనంతపూర్‌ క్లబ్‌ను సోమవారం ఆయన సందర్శించారు. క్లబ్‌ సభ్యులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. క్లబ్‌ గత ఐదేళ్లుగా వివాదాలకు కేంద్రంగా మారడం బాధాకరమని, ఇది ఒక సేవాకేంద్రంగా ఉండాలన్నారు. ఎటువంటి అవకతవకలు లేకుండా క్లబ్‌ను మేధావులకు నిలయంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషనతో మొదలు ఎన్నికల అధికారి, ప్రక్రియ మొత్తం బహిరంగపరిచి నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. మెజార్టీ సభ్యులు క్లబ్‌ నిర్వహణ, కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని ఎమ్మెల్యేని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ క్లబ్‌పై సంబంధిత అధికారులతో మాట్లాడి పారదర్శకతకు పెద్దపీట వేయాలన్నారు. నిధుల వినియోగం, సభ్యత్వ నమోదు, కొత్త సభ్యుల చేరిక, ఓటర్ల జాబితా తయారు బైలా ప్రకారం చేయాలని సూచించారు.

Updated Date - Jul 30 , 2024 | 12:03 AM

Advertising
Advertising
<