ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

యువరైతును కాటేసిన కరెంటు

ABN, Publish Date - Mar 18 , 2024 | 11:27 PM

కొత్త బోరు వేసి పంటదిగుబడి సాధించాలన్న ఓ యువరైతు ఆశను కరెంటు కాటేసిన ఘటన మండలంలోని గోవిందవాడలో సోమవారం చోటు చేసుకుంది.

బొమ్మనహాళ్‌, మార్చి 18: కొత్త బోరు వేసి పంటదిగుబడి సాధించాలన్న ఓ యువరైతు ఆశను కరెంటు కాటేసిన ఘటన మండలంలోని గోవిందవాడలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు గోవిందవాడ గ్రామానికి చెందిన ఉపేంద్ర(25) అనే యువరైతు తనకు చెందిన 1.50 ఎకరాల భూమిలో ఖరీ్‌ఫలో వేరుశనగ, రబీలో మిరపను సాగు చేశాడు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా లేక హెచ్చెల్సీ నీరు అంతంత మాత్రం రావడంతో, పంటల దిగుబడిపై ప్రభావం పడింది. వ్యవసాయ బోరు ఉంటే దిగుబడి బాగా వస్తుందని ఆశించిన ఉపేంద్ర నాలుగురోజుల క్రితం అప్పు చేసి బోరు వేయించాడు. సోమవారం మోటారు దింపి విద్యుత కనెక్షన ఇచ్చేందుకు విద్యుత స్తంభం ఎక్కి వైరు చుడుతున్న సమయంలో కరెంట్‌ సరఫరా కావడంతో కరెంటు స్తంభం నుండి కిందపడి స్పృహ కోల్పోయింది. అక్కడే ఉన్న కొందరు అతనిని బళ్లారి విమ్స్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య పవిత్ర, రెండేళ్ల కుమారుడు వల్లభ ఉన్నారని తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో బాధిత కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఉపేంద్ర మృతి చెందడంతో భార్య పవ్రిత ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. సంఘటనపై విద్యుత ఏఈ లక్ష్మీరెడ్డిని వివరణ కోరగా కరెంట్‌ షాక్‌తో ఉపేంద్ర మృతి చెందినట్లు సమాచారం అందిందన్నారు. మృతిచెందిన రైతుకు సంబంధించిన వివరాలు అందాల్సి ఉందని, విద్యుత ప్రమాదమా స్టార్టర్‌ పెట్టె వద్ద జరిగిందా అని దానిపై విచారిస్తామన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:28 PM

Advertising
Advertising