fire: సపోటా తోటకు గుర్తుతెలియని వ్యక్తుల నిప్పు
ABN, Publish Date - Apr 30 , 2024 | 12:39 AM
కొత్తచెరువు, ఏప్రిల్ 29:మండలంలోని వేములేటిపల్లి గ్రామసమీపంలో రైతు గండికోట ఆంజనేయులు ఐదెకరాలలో సాగు చేసిన సపోటా తోటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగి చెట్లన్నీ కాలిపోయాయి. ఘటనపై బాధిత రైతు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తనకున్న 5.45 ఎకరాలలో 688 సపోటా చెట్లను పదేళ్ల క్రితం సాగుచేశానన్నారు.

అయితే సోమవారం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కంచెకు నిప్పుపెట్టడంతో మంటలు తోటకు వ్యాపించి చెట్లన్నీ కాలిపోయాయని తెలిపారు. సమాచారం అందుకున్న ఫైౖర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే డ్రిప్ పరికరాలతో పాటు కోతకు వచ్చిన చెట్లన్నీ కాలిపోయాయన్నారు. దీంతో రూ.10లక్షల దాకా నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆయన కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 30 , 2024 | 12:39 AM