ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

EMPLOYEES: పెన్షనర్ల భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

ABN, Publish Date - Jun 09 , 2024 | 10:58 PM

రిటైర్డ్‌ అధికారులు నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎనజీఓ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక సమైక్యాంధ్ర భవనంలో ఏ పీఎనజీఓ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

Chandrasekhar Reddy is speaking

రాయదుర్గం రూరల్‌, జూన 9: రిటైర్డ్‌ అధికారులు నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎనజీఓ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక సమైక్యాంధ్ర భవనంలో ఏ పీఎనజీఓ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నాలుగో తరగతి ఉద్యోగులకు కేటాయించిన స్థలంలో అక్రమంగా ప్రవేశించి వారి బేస్‌మెంట్‌పై నిర్మాణం చేయడం దౌర్జన్యానికి పరాకాష్ట అన్నా రు. ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండా కేవలం గత ప్రభుత్వ ప్ర జాప్రతినిధుల అండదండలతో నిర్మించిన వారిపై వెంటనే క్రిమినల్‌ చర్యలుతీఈసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ మాట్లాడుతూ ప్రశాంతమైన ఈ ప్రాంతంలో అధికారులుగా ఉండి రిటైర్డ్‌ అయిన వ్యక్తులు దారుణానికి పాల్పడడం తగదని చెప్పారు. వెంటనే ఆ భవనాన్ని సొంతదారులైన నాలుగో తరగతి ఉద్యోగులకు స్వాధీనం చేయాలని కోరారు. కార్యక్రమంలో పెన్షన్ల సంఘం అధ్యక్షుడు డీ రామాంజనేయులు, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సంఘం నాయకులు హనుమాన, పరమేశ్వరప్ప, రామాంజనేయులు, పెన్షన సంఘం కార్యదర్శి సత్యనారాయణ, చిదానంద పాల్గొన్నారు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 10:58 PM

Advertising
Advertising