GROUNDNUT:వెంటాడుతున్న విత్తన సమస్య..!
ABN, Publish Date - Jun 08 , 2024 | 11:48 PM
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా రైతులకు విత్తన సమస్య వెంటాడుతోంది. గత సంవత్సరం వర్షాలు లేక దెబ్బతిన్న రైతన్నకు ఈ ఏడాది విత్తన వేరుశనగ లేక పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రైతన్నలు విత్తనాన్ని సమూకుర్చే పనిలో ఉన్నారు.
2 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు
97,886 క్వింటాళ్ల విత్తనకాయలు కేటాయింపు
మార్కెట్ ధరకు కొనలేమంటున్న రైతులు
నిబంధనలు సడలించి పంపిణీ చేయాలి
మడకశిర, జూన 8: వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా రైతులకు విత్తన సమస్య వెంటాడుతోంది. గత సంవత్సరం వర్షాలు లేక దెబ్బతిన్న రైతన్నకు ఈ ఏడాది విత్తన వేరుశనగ లేక పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రైతన్నలు విత్తనాన్ని సమూకుర్చే పనిలో ఉన్నారు. అయితే బహిరంగ మార్కెట్‌లో ధర పెరిగిపోవడంతో రైతులు కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నిబంధనలు సడలించి సబ్సిడీ విత్తన వేరుశనగ పంపీణీ చేయాలని రైతులు కోరుతున్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రతి ఏడాది వేరుశనగ పంట దెబ్బతిన రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత సంవత్సర తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంట ఎండిపోవడంతో వాటిని పొలాల్లో ఉండగానే తొలగించారు. దీనికి తోడు రబీలో అరకొర నీటికి సాగు చేసిన వేరుశనగ పంట కూడా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు.
అయితే ఈ ఏడాది ముంగారు వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో రైతులు పొలాలను దుక్కుదున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. బయట మార్కెట్‌లో ధర అధికంగా ఉండడంతో కోనలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న విత్తన వేరుశనగ మూడు బస్తాలు ఎకరాకు సరిపోతుందని, రెండు మూడు ఎకరాలు ఉన్న రైతులు విత్తనం కోసం ఇబ్బందులు పడతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వేరుశనగ క్వింటాల్ ధర రూ.5,700, మార్కెట్‌లో రూ.7,200 ధర ఉంది. దీంతో మార్కెట్‌లో విత్తనకాయలు కోనలేక పోతున్నామని రైతులు అంటున్నారు.
రెండు లక్షల హెక్టార్లకు విత్తన కేటాయింపు
జిల్ల్లాలో రెండు లక్షల హెక్టార్ల సాగుకు 97,886 కింటాళ్ల విత్తన వేరుశనగను ప్రభుత్వం కేటాయించింది. శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా ఖరీ్‌ఫలో వేరుశనగ పంటను సాగు చేస్తారు. కర్టాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న రైతులు పాడిపరిశ్రమ తరువాత వేరుశనగ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ప్రతి ఏడాది ఖరీ్‌ఫలో రెండు లక్షలహెక్టార్లలో వేరుశనగపంటను సాగుచేస్తారు. ప్రతిసారి అప్పులు చేసి పంట సాగు చేయడం, పంట కాస్త ఎదో కారణంగా పంటదెబ్బతిని పూర్తిగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నిబంధనలు సడిలించి రైతుకు అవసరం మేరకు విత్తనం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Jun 08 , 2024 | 11:48 PM