ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HELPING TO VYANAD PEOPLE: ఆదర్శం... ఆ యువకుల సాయం

ABN, Publish Date - Aug 05 , 2024 | 12:07 AM

ఆ ఇద్దరు యువకులు తమ స్నేహితులతో కలిసి చేసిన సాయం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అనంతపురం నగరంలోని ఓ సెల్‌ పాయింట్‌కు చెందిన షంశుద్దీన, రోషన ప్రతి ఏడాది సహజసిద్ధ అందాలకు నిలయమైన వాయనాడ్‌కు వెళ్తుంటారు.

Shamshuddina and Roshana with essentials collected for Wayanad victims

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 4: ఆ ఇద్దరు యువకులు తమ స్నేహితులతో కలిసి చేసిన సాయం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అనంతపురం నగరంలోని ఓ సెల్‌ పాయింట్‌కు చెందిన షంశుద్దీన, రోషన ప్రతి ఏడాది సహజసిద్ధ అందాలకు నిలయమైన వాయనాడ్‌కు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం ప్రకృతి ప్రకోపంతో వాయనాడ్‌లో 320 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రతిసారి తాము విడిదిచేసే ఆ ప్రాంతం హృదయ విదారకర పరిస్థితి చూసి ఈ యువకులు చలించిపోయారు. మానవతా దృక్పథంతో తమవంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. హెల్ప్‌ వయనాడ్‌ అనే వాట్సాప్‌ గ్రూపును ఏర్పా టు చేసి అందులో తమ మిత్రులను చేర్చారు. తొలుత త మవంతుగా తలా పదివేలు జమ చేసి, మిగతా సహాయం కోసం మిత్రులను కోరగా వారు కూడా తోచినంత సహా యం అందించారు. ఇలా సేకరించిన సొమ్ము మొత్తం రూ.50వేలు కాగానే హోల్‌సేల్‌ దుకాణాలద్వారా నిత్యావసర వస్తు సామగ్రి కొనుగోలు చేసి, ఆదివారం బెంగళూరులోని మళయాలీ సమాజ్‌ కార్యాలయంలో అందజేశారు. సహాయమందించిన యువకులంతా 25 సంవత్సరాల్లోపువారే కావడం గమనార్హం. కార్యక్రమంలో జమీర్‌, సోమశేఖర్‌ పాల్గొన్నారు

Updated Date - Aug 05 , 2024 | 12:07 AM

Advertising
Advertising
<