ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TREE PLANTAION: చెట్టుకు జీవం..!

ABN, Publish Date - Aug 26 , 2024 | 12:27 AM

ఒక చెట్టే కదా..! పోతే పోయిందిలే అని అనుకోకుండా దానికి మళ్లీ ప్రాణం పోయడానికి తపిస్తు న్నారు. నగరంలోని గ్రీనఆర్మీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. ఈక్రమంలోనే నగరంలోని పాతూరులో విద్యుత్తు తీగలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఉన్న 40 ఏళ్ల వయస్సున్న మేడి చెట్టును కార్పొరేషన అధికారులు ఆదివారం తొలగించారు.

Green Army volunteers at tree planting

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 25: ఒక చెట్టే కదా..! పోతే పోయిందిలే అని అనుకోకుండా దానికి మళ్లీ ప్రాణం పోయడానికి తపిస్తు న్నారు. నగరంలోని గ్రీనఆర్మీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. ఈక్రమంలోనే నగరంలోని పాతూరులో విద్యుత్తు తీగలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఉన్న 40 ఏళ్ల వయస్సున్న మేడి చెట్టును కార్పొరేషన అధికారులు ఆదివారం తొలగించారు. ఈ సమాచారాన్ని నగరంలోని గ్రీనఆర్మీ స్వచ్ఛంద సంస్థ సిబ్బందికి అందించారు. దీంతో వారు వచ్చి ఆ వృక్షం కొమ్మలను కత్తిరించి మిగిలిన భాగాన్ని జాగ్రత్తగా ట్రాక్టర్‌పైకి ఎక్కించి హెచ్చెల్సీ కాలనీకి తరలించారు. కాలనీలోని ఈఈ కార్యాలయం ఆవరణలో దాన్ని జాగ్రత్తగా మళ్లీ నాటారు. 56రోజుల్లో వృక్షం తిరిగి పెరగడం ప్రారంభిస్తుందని గ్రీన ఆర్మీ వ్యవస్థాపకులు ఏజీ అనీల్‌కుమార్‌ తెలిపారు. నగరంలో ఎక్కడ వృక్షాలు తొలగించినా తమ దృష్టికి తీసుకువస్తే మరో చోట ఆ వృక్షాన్ని నాటి బతికించే బాధ్యత తాము తీసుకుంటామని గ్రీనఆర్మీ సిబ్బంది తెలిపారు.

Updated Date - Aug 26 , 2024 | 12:27 AM

Advertising
Advertising
<