ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ALMEWA : మైనార్టీల సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:07 AM

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆల్‌మేవా రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ ఫకృద్దీన డిమాండ్‌ చేశారు.

Fakriddina explaining the problems to Minister NMD Farooq

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆల్‌మేవా రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ ఫకృద్దీన డిమాండ్‌ చేశారు. ఆదివారం నంద్యాలలోని నేషనల్‌ పీజీ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర ఆల్‌మేవా వార్షిక మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫకృద్దీన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సామాజికవర్గానికి చెందిన అనేక పేద కుటుంబాలున్నాయని, వారి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. వక్ఫ్‌ అమెండ్మెంట్‌ యాక్టును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి, వక్ఫ్‌బోర్డు ఆధీనంలోనే ఉండేలా చూడాలన్నారు. ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం అమలులో ఆల్‌మేవా తరపున ప్రతి జిల్లా కమిటీలోనూ ఇద్దరు చొప్పున సభ్యులను నియమించి పథకం సమగ్రంగా అమలయ్యేలా చొరవ చూపాలన్నారు. కనీసం మూడు నెలలకోసారి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆల్‌మేవా కర్నూలు జిల్లా అధ్యక్షుడు షేక్షావలి, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఫారూక్‌ మొహ్మద్‌, హిదయతుల్లా, జిలానబాషా, మహబూబ్‌బాషా, మహబూబ్‌ దౌలా పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 12:07 AM