ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

COLLECTOR: గ్రామీణాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

ABN, Publish Date - Aug 03 , 2024 | 11:32 PM

గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్ర కీలకమని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. శనివారం సాయంత్రం డీఆర్‌డీఏ-వెలుగు కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసిన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Collector Vinod Kumar inspecting DRDA-Velugu office

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 3: గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్ర కీలకమని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. శనివారం సాయంత్రం డీఆర్‌డీఏ-వెలుగు కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసిన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డీఆర్‌డీఏ-వెలుగు పరిధిలో అమలవుతున్న పథకాలు, మండల స్థాయి, గ్రామస్థాయిలో ఉద్యోగుల పనితీరు, ప్రగతిపై నిత్యం పరిశీలించాలని ఆదేశించారు. అన్ని విభాగాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమష్టి కృషి చేయాలన్నారు. కార్యాలయానికి ఐఎ్‌సఓ-9001ః2015 సర్టిఫికెట్‌ పొంది, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, ఉన్నతస్థాయి ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం అభ్యుదయభవన పరిశీలించి, త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. డీఆర్‌డీఏ-వెలుగు పీడీ ఓబుళమ్మ, ఏపీడీ ఈశ్వరయ్య, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2024 | 11:32 PM

Advertising
Advertising
<