ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KESHAV: ఓటమి భయంతోనే వైసీపీ నాయకుల దాడులు

ABN, Publish Date - May 06 , 2024 | 12:20 AM

ఓటమి భయంతోనే వై సీపీ నాయకులు ప్రచారానికి వెళ్తున్న మహిళలు, టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కే శవ్‌ అన్నారు. ఉరవకొండలో ప్రచారానికి వెళ్లిన ముస్లిం మహిళలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్వో, జేసీ కేతనగార్గ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.

విలేకరులతో మాట్లాడుతున్న కేశవ్‌

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, మే 5: ఓటమి భయంతోనే వై సీపీ నాయకులు ప్రచారానికి వెళ్తున్న మహిళలు, టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కే శవ్‌ అన్నారు. ఉరవకొండలో ప్రచారానికి వెళ్లిన ముస్లిం మహిళలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్వో, జేసీ కేతనగార్గ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. దాడికి సంబంధించిన వీడియో ఆధారాలను ఆర్వోకు చూపించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ చూడని విధంగా వైసీపీ నాయకులు దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు విరుద్ధంగా నియోజకవర్గంలో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగపై ఉందన్నారు. ఇలా దాడులకు దిగితే భయపడే ప్రసక్తే లేదన్నారు. అధికారులు సమస్యను పరిష్కరించనిపక్షంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. టీడీపీ నాయకులు రహంతుల్లా, సుదర్శన పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2024 | 12:20 AM

Advertising
Advertising