ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

JCPR CAMPAIN: తాడిపత్రిలో ఎగిరేది పసుపు జెండానే

ABN, Publish Date - May 11 , 2024 | 12:15 AM

ఎన్నికల ఫలితాల్లో తాడిపత్రిలో ఎగిరేది పసుపు జెండానే, గెలిచేది జేసీ అశ్మితరెడ్డే అని, వచ్చే ఐదేళ్లల్లో అభివృద్ధి అంటే ఏమిటో నా బిడ్డ చేసి చూపిస్తాడని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. పట్టణంలోని సీబీరోడ్డు, అశోక్‌పిల్లర్‌, మెయినబజారు, నవరంగ్‌ టాకీ్‌సరోడ్డు, పోలీ్‌సస్టేషనరోడ్డు మీదుగా ర్యాలీ సాగింది.

మహిళను ఓటు అభ్యర్థిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

మేనిఫెస్టోతో తాడిపత్రి రూపురేఖలు మారతాయి

నేను ఎక్కడికీ పోను ఇక్కడే ఉంటా: జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రిటౌన, మే10: ఎన్నికల ఫలితాల్లో తాడిపత్రిలో ఎగిరేది పసుపు జెండానే, గెలిచేది జేసీ అశ్మితరెడ్డే అని, వచ్చే ఐదేళ్లల్లో అభివృద్ధి అంటే ఏమిటో నా బిడ్డ చేసి చూపిస్తాడని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. పట్టణంలోని సీబీరోడ్డు, అశోక్‌పిల్లర్‌, మెయినబజారు, నవరంగ్‌ టాకీ్‌సరోడ్డు, పోలీ్‌సస్టేషనరోడ్డు మీదుగా ర్యాలీ సాగింది. ర్యాలీలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ పవనరెడ్డి, కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. ప్రతి షాపువద్దకు వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటువేయాలని యజమానులను అభ్యర్థించారు. మెయినబజారులో నిర్వహించిన సభలో జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ తనను ఆదరించిన విధంగానే నా బిడ్డ అశ్మితరెడ్డిని ఆదరించాలని కోరారు.


సైకో జగన పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. విజన ఉన్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. గాంధీసర్కిల్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మూడేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గెలిచినా తాడిపత్రిలో మాత్రం నన్ను గుర్తుంచుకొని గెలిపించారని, ఇప్పటికీ ప్రతిరోజూ తాను గుర్తుచేసుకుంటానని భావోద్వేగానికి లోనయ్యారు. ఇక్కడి ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత అందరిని నరుకుతాడంట, నరకడానికి ఏమైనా పుచ్చకాయలు అనుకున్నాడేమో ఆయనకు చెట్లను నరకడం బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత తాము ఎక్కడికో వెళ్లిపోతామని అవాకులు చెవాకులు చెప్పే ప్రతి ఒక్కరికి ఇదే చెబుతున్నా నా మనవళ్లు కూడా రెడీ అవుతున్నారని ఎలాంటి అపోహాలు, సందేహాలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.


జేసీ అశ్మితరెడ్డి గెలుపు ఖాయమైంది : పవనరెడ్డి

మీ ప్రేమ, అభిమానం చూస్తుంటే అశ్మితరెడ్డి గెలుపు ఖాయమైందని పవనరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో తాను జ్యోతిష్యం నేర్చుకున్నానన్నారు. ఈ సందర్భంగా జేసీ అశ్మితరెడ్డి చేయిచూసి చెబుతూ నా తమ్ముడు, నాన్న దివాకర్‌రెడ్డి కన్నా రెండుసార్లు పైగానే ఎమ్మెల్యేగా గెలుపొంది మీకు సేవ చేస్తాడని తెలిపారు. ప్రచారంలో వస్తున్న ఆదరణ చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. తమ కుటుంబానికి మైనార్టీలు ఎల్లప్పుడూ అండగా ఉన్నారన్నారు. ఎన్నికలరోజు ప్రతి ఒక్కరూ అందరితో ఓటు వేయించాలని కోరారు. జేసీ అశ్మితరెడ్డి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని అందువల్ల మాట్లాడలేకపోతున్నాడని తెలిపారు. గెలిచిన తర్వాత ఇదే సెంటర్‌లో విజయోత్సవ సభలో ఆయన మాట్లాడతాడని తెలిపారు.

Updated Date - May 11 , 2024 | 12:15 AM

Advertising
Advertising