ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీవారికి తాగునీరు ఇచ్చేది లేదు

ABN, Publish Date - May 25 , 2024 | 12:00 AM

మండల పరిధిలోని హెచఎ్‌స తండాలో టీడీపీ వర్గీయులకు శుద్ధ జలాలను ఇచ్చేందుకు వైసీపీ వర్గీయులు నిరాకరించారు. గట్టిగా నిలదీసినందుకు కర్రలతో దాడిచేశారు. దీంతో టీడీపీ వర్గీయులు ఆరుగురు గాయపడ్డారు. తండాలో పంచాయతీ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నిర్వహణ బాధ్యతలను వైసీపీ నాయకుడు శివనాయక్‌, ఆయన భార్య శకుంతల రూపాబాయి చూసుకుంటున్నారు.

ఫ దిక్కున్నచోట చెప్పుకోండిఫ రెచ్చిపోయిన వైసీపీ వర్గీయులు.. కర్రలతో దాడిఫఆరుగురికి గాయాలు

డి.హీరేహాళ్‌, మే 24: మండల పరిధిలోని హెచఎ్‌స తండాలో టీడీపీ వర్గీయులకు శుద్ధ జలాలను ఇచ్చేందుకు వైసీపీ వర్గీయులు నిరాకరించారు. గట్టిగా నిలదీసినందుకు కర్రలతో దాడిచేశారు. దీంతో టీడీపీ వర్గీయులు ఆరుగురు గాయపడ్డారు. తండాలో పంచాయతీ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నిర్వహణ బాధ్యతలను వైసీపీ నాయకుడు శివనాయక్‌, ఆయన భార్య శకుంతల రూపాబాయి చూసుకుంటున్నారు. టీడీపీ వర్గీయులైన దేవిబాయి గురువారం ప్లాంట్‌ వద్దకు వెళ్లి నీటి కోసం డబ్బు చెల్లించబోయారు. నీరు ఇచ్చేందుకు శకుంతల రూపాబాయి ఒప్పుకోలేదు. అదే సమయంలో వచ్చిన ఇతరులకు మాత్రం నీటిని వదిలారు. దేవీబాయి నిలదీయడంతో దిక్కున్నచోట చెప్పుకోవాలని, టీడీపీ వర్గీయులకు నీరు ఇచ్చేది లేదని శకుంతల రూపాబాయి గొడవకు దిగింది. దేవిబాయిపై దాడి చేసింది. గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు తండాకు వెళ్లి విచారించారు. ఇరువర్గాలను డి.హీరేహాళ్‌ పోలీ్‌సస్టేషనకు పిలిపించి మందలించి పంపించారు. తండాకు వెళ్లాక టీడీపీ వర్గీయులపై గురువారం రాత్రి వైసీపీ వర్గీయులు శివనాయక్‌, లోకేష్‌ నాయక్‌, ఎసుంది నాయక్‌ తదితరులు కర్రలతో దాడిచేశారు. దీంతో టీడీపీ వర్గీయులు గవిసిద్ధనాయక్‌, దేవీబాయి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకునేందుకు వెళ్లినవారి పైనా వైసీపీ వర్గీయులు దాడి చేశారు. దీంతో మరో నలుగురు గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ గురు ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Updated Date - May 25 , 2024 | 12:00 AM

Advertising
Advertising