Share News

రెడ్డిపల్లిలో దాహం దాహం

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:29 AM

మండలపరిధిలోని రెడ్డిపల్లిలో ఓ ప్రాంతం ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రెడ్డిపల్లిలో దాహం దాహం
రెడ్డిపల్లిలో ద్విచక్రవాహనంపై నీటిని తీసుకెళ్తున్న దృశ్యం

రొద్దం, ఏప్రిల్‌ 14 : మండలపరిధిలోని రెడ్డిపల్లిలో ఓ ప్రాంతం ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లిలో దొడగట్ట - రొద్దం ప్రధాన రహదారి పక్కన దాదాపు 25 ఇళ్ల వారు నివాసం ఉంటున్నారు. ఆ ఇళ్లకు కొద్ది రోజులు గా నీరు సరఫరా కావడం లేదు. ఎండకాలం కావడతో గ్రామంలోని బోరు బావుల్లో నీటి మట్టం తగ్గింది. దీనికి తోడు ఆ ఇళ్లు మిట్ట ప్రాంతంలో ఉండడంతో వారికి సరిగా నీరు సరఫరా కావడంలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైక్‌లు, సైకిళ్లు, ఆటోల ద్వారా వ్యవసాయ బావులు, పక్క గ్రామాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఎన్నోమార్లు సచివాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సోలార్‌ సిస్టం ట్యాంకు మరమ్మతులు చేసినా నీటి సమస్య తీరలేదన్నారు. ఎండాకొలంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Apr 15 , 2024 | 12:29 AM