NETTIKANTI : కసాపురంలో తిరుమంజన స్నపనం
ABN, Publish Date - Aug 03 , 2024 | 11:52 PM
పునర్వసు తిరునక్షత్రం సందర్భంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సీతారామచం ద్రస్వామి వార్లకు తిరుమంజన స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి.. తిరుమంజన స్నపనం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదా లను అందజేశారు.
గుంతకల్లు టౌన, ఆగస్టు 3: పునర్వసు తిరునక్షత్రం సందర్భంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సీతారామచం ద్రస్వామి వార్లకు తిరుమంజన స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి.. తిరుమంజన స్నపనం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదా లను అందజేశారు. వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
నెట్టికంటి సన్నిధిలో గుత్తి ఆరో అదనపు న్యాయాధికారి
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని శనివారం గుత్తి ఆరో అదనపు న్యాయాధికారి ఎం శ్రీహరి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకు లు న్యాయాధికారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయం లో ప్రదిక్షణలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి అశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 03 , 2024 | 11:53 PM