ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JANSENA: శ్రీవారి లడ్డూలో కల్తీకి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి

ABN, Publish Date - Sep 23 , 2024 | 11:49 PM

హిందువులు మహాప్రసాదంగా భావిం చే శ్రీవారి లడ్డూలో వినిగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మదుసూదనరెడ్డి అన్నారు.

Chilakam and Janasena leaders doing Sanghibhava Diksha

ధర్మవరం,సెప్టెంబరు 23: హిందువులు మహాప్రసాదంగా భావిం చే శ్రీవారి లడ్డూలో వినిగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మదుసూదనరెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌ శ్రీవారి లడ్డూలో కల్తీ చేయడా న్ని నిరసిస్తూ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ధర్మవరంలో చిల కం మధుసూదనరెడ్డి కొత్తపేట వెంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. ముందుగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూ జలు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి హిందు వు, సనాతన ధర్మాన్ని పాటించేవారందరూ ఈ అక్రమాలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వెంకటేశ్వరస్వామి జోలికి వచ్చినవారు ఏమైయ్యారో అందరికి తెలుసన్నారు. వైఎ్‌సజగన కూడా శ్రీవారి జోలికి వెళ్లాడని అందుకే గత ఎన్నికలలో ఘోర పరాజయం పొందారన్నారు. జనసేన నాయకులు బెస్త శ్రీనివాసులు, అడ్డగిరి శ్యాంకుమార్‌, రాజారెడ్డి, వెంకటరెడ్డి, నాగసుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు

కదిరి అర్బన: తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీకి ప్రయశ్చిత్తంగా ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ చేపట్టిన దీక్షకు మద్దతుగా పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయలో జనసేన నాయకులు సోమవారం దీక్షచేపట్టారు. వారు మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో జంతువులకొవ్వును, చేప నూనెను వినియోగించిన గత టీటీడీ చైర్మన వైవీసుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భైౖరవప్రసాద్‌, చలపతి, కుటాల లక్షణ్‌, రాజేంద్రప్రసాద్‌, రమణ, గంగరాజు, రాజేష్‌, సోముశేఖర్‌, పార్థసారధి పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 11:49 PM