RATHOTSAVAM ; వైభవంగా తోటప్పజ్ఞ స్వామి రథోత్సవం
ABN, Publish Date - Aug 28 , 2024 | 12:26 AM
మండలంలోని బొల్లనగుడ్డంలో వెలసిన తోటప్పజ్ఞస్వామి 47వ పూజోత్సవంలో భాగంగా మంగళవారం వైభవంగా రథోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి గంగపూజ, గణపతిపూజ, నవగ్రహ పూజా, పంచామృతాభిషేకం, రుద్రహోమం నిర్వ హించి సాయంత్రం భారీ జనసందోహం మధ్య రథోత్సవాన్ని లాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరై స్వామివారికి పూజలు జరిపించి రథాన్ని లాగారు.
బొమ్మనహాళ్, ఆగస్టు 27: మండలంలోని బొల్లనగుడ్డంలో వెలసిన తోటప్పజ్ఞస్వామి 47వ పూజోత్సవంలో భాగంగా మంగళవారం వైభవంగా రథోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి గంగపూజ, గణపతిపూజ, నవగ్రహ పూజా, పంచామృతాభిషేకం, రుద్రహోమం నిర్వ హించి సాయంత్రం భారీ జనసందోహం మధ్య రథోత్సవాన్ని లాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరై స్వామివారికి పూజలు జరిపించి రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్లు బలరాంరెడ్డి, హనుమం తరెడ్డి, సింగల్ విండో మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి మల్లికార్జున, అప్పారావు, మాజీ డైరెక్టర్లు మహేంద్ర, నాగరాజు, టీడీపీ నాయకులు సల్లాపురం బాబు, గ్యాస్ గోవింద, మాజీ ఎంపీటీసీ గోపాల్, వన్నూరుస్వామి, మల్లికార్జున, సైకిల్‌షాప్ హనుమంత తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 28 , 2024 | 12:26 AM