ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GURUPOURNAMI : నేడు గురుపౌర్ణమి

ABN, Publish Date - Jul 20 , 2024 | 11:49 PM

సద్గురు సాయినాథుని జయంతి గురుపూర్ణిమ వేడుకలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు సాయిమందిరాల్లో రెండురోజుల క్రితం నుంచే సంబరాలను ప్రారంభించారు. సాయిసచ్ఛరిత్ర పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నగరోత్సవాలు నిర్వహించారు. గురుపౌర్ణమి నేపథ్యంలో ఆదివారం నిర్వహించనున్న వేడుకలకు ఇప్పటికే ఆలయాలన్నింటినీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

Shirvukatta Shirdisai Temple illuminated by the lights of electric lamp

అనంతపురం కల్చరల్‌, జూలై 20: సద్గురు సాయినాథుని జయంతి గురుపూర్ణిమ వేడుకలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు సాయిమందిరాల్లో రెండురోజుల క్రితం నుంచే సంబరాలను ప్రారంభించారు. సాయిసచ్ఛరిత్ర పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నగరోత్సవాలు నిర్వహించారు. గురుపౌర్ణమి నేపథ్యంలో ఆదివారం నిర్వహించనున్న వేడుకలకు ఇప్పటికే ఆలయాలన్నింటినీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయాలకు నూతన రంగులు వేయడంతోపాటు విద్యద్దీపాలంకరణలతో అలంకరించారు. జిల్లా వ్యాప్తంగా వున్న సాయి మందిరాలన్నీ ఆదివారం భక్తులతో కిటకిటలాడనున్నాయి. భక్తుల తాకిడిని దృష్టిలో వుంచుకుని పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా షామియానాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూడవరోడ్డు షిర్డిసాయి ఆలయంలో శనివారం నుంచే అఖండ సాయి సచ్చరిత్ర పారాయణం పఠించారు. వేడుకల్లో భాగంగా ఆలయాల్లో సాయిసత్య వ్రతాలతోపాటు విశేషాలంకరణలు, ప్రత్యేక పూజాదులు నిర్వహించనున్నారు. అనంతపురం నగరంలోని పురాతన ఆలయమైన చెరువుకట్ట షిర్డిసాయి ఆలయం, వేణుగోపాల్‌నగర్‌ సద్గురు సాయినాథ్‌ మందిరం, మూడవరోడ్డులోని షిర్డిసాయి ఆలయం, వేమన టెలిఫోన్‌ భవన్‌ ఎదురుగా వున్న సాయిమందిరం, శారదానగర్‌లోని శివబాలయోగి ఆశ్రమం, హెచ్చెల్సీ కాలనీలోని సాయిబాబా ఆలయాలతోపాటు అన్ని ప్రాంతాల్లోని సాయిమందిరాల్లో విశేష పూజలు నిర్వహించనున్నారు.

Updated Date - Jul 20 , 2024 | 11:49 PM

Advertising
Advertising
<