ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP DSC : మాకూ శిక్షణ ఇవ్వండి

ABN, Publish Date - Jul 04 , 2024 | 11:43 PM

ఆర్థికంగా వెనుకబడిన ఓసీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ప్రకటించింది. విద్య, ఉద్యోగాలు, ఉపాధి సహా అన్నింటీ వారికి పదిశాతం రిజర్వేషన్లు అమలవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ఇచ్చే ఉచిత శిక్షణలోనూ 10 శాతం కోటా కల్పించాలి. కానీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. గ్రూప్‌-1, 2 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఉన్నా.. అందులో ...

Ananthapur BC Study Circle

ప్రభుత్వానికి ఆర్థికంగా వెనుకబడిన ఓసీల వినతి

డీఎస్సీ శిక్షణలో కనిపించని ఈడబ్ల్యూఎస్‌ కోటా

అనుమతి లేదంటున్న బీసీ సంక్షేమ శాఖ అధికారులు

వైసీపీ ప్రభుత్వంలో అందని గ్రూప్‌-1, 2 శిక్షణ

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జూలై 4: ఆర్థికంగా వెనుకబడిన ఓసీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ప్రకటించింది. విద్య, ఉద్యోగాలు, ఉపాధి సహా అన్నింటీ వారికి పదిశాతం రిజర్వేషన్లు అమలవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ఇచ్చే ఉచిత శిక్షణలోనూ 10 శాతం కోటా కల్పించాలి. కానీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. గ్రూప్‌-1, 2 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఉన్నా.. అందులో ఈడబ్ల్యూఎస్‌ కోటా కేటాయించలేదు. దీంతో జిల్లాలో వందలాది మంది ఆ


వర్గాలవారు శిక్షణకు దూరమయ్యారు. అప్పటి మంత్రి ఉష శ్రీచరణ్‌, రాష్ట్రస్థాయి అధికారులు సైతం పట్టించుకోలేదు. ఇలా ఈడబ్ల్యూఎస్‌ కోటా అటకెక్కింది. టీడీపీ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్పీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమశాఖ అధికారులు డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రమే అవకాశం కల్పించారు. తమకూ అవకాశం ఇవ్వాలని ఆర్థికంగా వెనుకబడి ఓసీ వర్గాల అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు బీసీ స్డడీ సర్కిల్‌కు వచ్చి దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈడబ్ల్యూఎ్‌సకు అవకాశం లేదని అధికారులు చెబుతుండటంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.

చొరవ చూపాలి..

బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత శిక్షణకు నాలుగు రోజుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. బీసీలకు 66, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 శాతం సీట్లను కేటాయించారు. ఆ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి.. శిక్షణ ఇస్తారు. కానీ ఈడబ్ల్యూసీ కోటా కింద దరఖాస్తులను స్వీకరించడం లేదు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు చొరవ చూపితే ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకూ న్యాయం జరుగుతుంది. గతంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉచిత శిక్షణ విషయంలో ఈడబ్ల్యూఎ్‌సకు అవకాశం కల్పించలేదు. అప్పట్లో ఎంతో మంది అభ్యర్థులు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఉషశ్రీచరణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకపోయింది. మంత్రిగా సవిత తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.


అనుమతి ఇవ్వలేదు..

డీఎస్సీ ఉచిత శిక్షణలో ఈడబ్ల్యూఎస్‌ కోటాకు అనుమతి ఇవ్వలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించమని ఆదేశాలు ఉన్నాయి. ఆ మేరకే దరఖాస్తులు ఆహ్వానించాం. ఈ నెల 7వ తేదీ వరకూ మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తాం. అంతటితో గడువు ముగుస్తుంది.

- కుష్బూ కొఠారీ, డీడీ, బీసీ సంక్షేమశాఖ

ప్రభుత్వమే ఆదుకోవాలి

డీఎస్సీ ఉచిత శిక్షణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషనను అమలు చేయాలి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. లేదంటే మాలాంటి ఎంతో మంది ఓసీలు నష్టపోయే ప్రమాదం ఉంది. సరైన శిక్షణ లేకపోతే ఉద్యోగాలకు దూరమౌతాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆలోచించి మాకు న్యాయం చేయాలి.

- వేణుగోపాల్‌ రెడ్డి, అనంతపురం

ఓసీలను ఆదుకోవాలి..

డీఎస్సీ ఉచిత శిక్షణ గురించి పత్రికల్లో చూసి బీసీ స్టడీ సర్కిల్‌కు వచ్చాను. దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన అడిగితే.. ఇక్కడి అధికారులు ఈడబ్ల్యూ ఎస్‌కు అవకాశం లేదని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరించాలని సూచించారట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓసీ వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో రాష్ట్రస్థాయి అధికారులు స్పందించాలి. ఈడబ్ల్యూఎ్‌సకు అవకాశం కల్పించాలి.

- అరుణ, అనంతపురం

మంత్రి చొరవ చూపాలి..

గ్రూప్‌-1, గ్రూప్‌-2 విషయంలో ఈడబ్ల్యూఎ్‌సను లేకుండా చేశారు. ఇప్పుడు డీఎస్సీ కోచింగ్‌ కోసం వస్తే ఇక్కడి అధికారులు మళ్లీ ఈడబ్ల్యూఎస్‌ లేదని చెబుతున్నారు. మాలాంటి వాళ్లు వేలకు వేలు డబ్బులు కట్టి ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకోము. బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఈ విషయంలో కలుగుజేసుకుని మాకు న్యాయం చేయాలి.

- కె శిల్ప, అనంతపురం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 04 , 2024 | 11:43 PM

Advertising
Advertising