ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SP : ఎస్పీ మురళీకృష్ణ బదిలీ

ABN, Publish Date - Aug 17 , 2024 | 01:13 AM

ఎస్పీ కేవీ మురళీకృష్ణ బదిలీ అయ్యారు. ఆయనను విశాఖపట్నం 16వ బెటాలియన కమాండెంట్‌గా బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన ఎస్పీగా వెయిటింగ్‌లో ఉన్న పి.జగదీశను నియమించారు. 2017 ఐపీఎస్‌ బ్యాచకు చెందిన జగదీశ కర్ణాటకవాసి. తొలుత చిత్తూరు ఏఎస్పీగా పనిచేశారు. అనంతపురం 14వ బెటాలియన కమాండెంట్‌గా, పాడేరులో గ్రేహౌండ్స్‌ కమాండర్‌గా, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఇటీవల ఐపీఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయనను డీజీపీకి రిపోర్టు ..

Jagdish

కొత్త ఎస్పీ జగదీశ

అనంతపురం క్రైం, ఆగస్టు 16: ఎస్పీ కేవీ మురళీకృష్ణ బదిలీ అయ్యారు. ఆయనను విశాఖపట్నం 16వ బెటాలియన కమాండెంట్‌గా బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన ఎస్పీగా వెయిటింగ్‌లో ఉన్న పి.జగదీశను నియమించారు. 2017 ఐపీఎస్‌ బ్యాచకు చెందిన జగదీశ కర్ణాటకవాసి. తొలుత చిత్తూరు ఏఎస్పీగా పనిచేశారు. అనంతపురం 14వ బెటాలియన కమాండెంట్‌గా, పాడేరులో గ్రేహౌండ్స్‌ కమాండర్‌గా, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఇటీవల ఐపీఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయనను డీజీపీకి రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. కేవీ మురళీకృష్ణ బదిలీతో వెయిటింగ్‌లో ఉన్న జగదీశను అనంతపురం జిల్లా ఎస్పీగా నియమించారు. కేవీ మురళీకృష్ణ వ్యక్తిగత కారణాలతో విశాఖకు బదిలీ చేయించుకున్నారని సమాచారం. ఆయన భార్య క్యాన్సర్‌ వైద్య నిపుణురాలు. విశాఖలో ఆమె పనిచేస్తున్నారు. ఆ పోస్టు అనంతలో లేకపోవడంతో ఎస్పీ మురళీ కృష్ణ అక్కడికి బదిలీ చేయించుకున్నారని సమాచారం.


అప్పుడే రావాల్సింది..

జిల్లాకు వస్తున్న ఎస్పీ జగదీశ తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే ఎస్పీగా పనిచేశారు. ఇక్కడి ఏపీఎస్పీ 14వ బెటాలియన కమాండెంట్‌గా కొంతకాలం పనిచేయడంతో జిల్లాపై అవగాహన ఉంది. ఎన్నికల ముందు జరిగిన బదిలీల సమయంలోనే ఆయన జిల్లాకు వస్తారనే ప్రచారం జరిగింది. కానీ అప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేశారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. అధికారులు, సిబ్బంది అవినీతిపైనా కఠినంగా వ్యవహరిస్తారని సమాచారం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Aug 17 , 2024 | 01:13 AM

Advertising
Advertising
<