ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JUDAS: తగ్గని జూడాలు

ABN, Publish Date - Aug 22 , 2024 | 12:26 AM

కోల్‌కతాలో మహిళా డాక్టర్‌ హత్యాచార ఘటనపై జిల్లాకేంద్రంలో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన బుధవారం కొనసాగింది. సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వందలాదిమంది పాల్గొని తమ నిరసనను తెలిపారు.

అనంతపురం టౌన, ఆగస్టు 21: కోల్‌కతాలో మహిళా డాక్టర్‌ హత్యాచార ఘటనపై జిల్లాకేంద్రంలో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన బుధవారం కొనసాగింది. సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వందలాదిమంది పాల్గొని తమ నిరసనను తెలిపారు. అక్కడ నుంచి వందలాదిమంది ర్యాలీగా బయలుదేరి సప్తగిరి సర్కిల్‌ చేరుకున్నారు. అక్కడ మానవహారంగా ఏర్పడి డాక్టర్‌ను చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేపట్టారు. ర్యాలీకి సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, రమణయ్య, నారాయణస్వామి సంఘీభావం తెలిపారు. సాయంత్రం డాక్టర్లు బైక్‌ర్యాలీ కొనసాగించారు. ఈ ఆందోళనకు మద్దతుగా సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. జడ్పీ కార్యాలయం నుంచి సర్వజన ఆస్పత్రి వరకు ప్రదర్శన కొనసాగించారు. సీఐటీయూ నాయకులు ఓబులు, నాగేంద్రకుమార్‌, నాగమణి, నాగభూషణం, సూర్యనారాయణ, రమాదేవి, పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2024 | 12:26 AM

Advertising
Advertising
<