RATHOTSWAM: వైభవంగా వెంకటరమణ స్వామి బ్రహ్మరథోత్సవం
ABN, Publish Date - May 27 , 2024 | 11:45 PM
ప్రసిద్ధిగాంచిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారికి సుప్రభాత సేవ, గంగపూజ, కుంకుమార్చన, వస్త్ర, పుష్ప అలంకరణ తదితర పూజలు చేశారు. అనంతరం స్వామి ఉత్సవ మూర్తులను మడుగు తేరులో ప్రతిష్ఠించారు.
గోవింద నామస్మరణతో మార్మోగిన దుర్గం వీధులు
రాయదుర్గం రూరల్, మే 27: ప్రసిద్ధిగాంచిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారికి సుప్రభాత సేవ, గంగపూజ, కుంకుమార్చన, వస్త్ర, పుష్ప అలంకరణ తదితర పూజలు చేశారు. అనంతరం స్వామి ఉత్సవ మూర్తులను మడుగు తేరులో ప్రతిష్ఠించారు. రథం వద్ద హోమం నిర్వహించి అనంతరం వినాయక సర్కిల్ వరకు మడుగు తేరును లాగారు. మధ్యాహ్నం భక్తులు రథం వద్ద స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వేలాది మంది భక్తుల నడుమ రథాన్ని రామాంజనేయుల స్వామి దేవాలయం వరకు లాగారు. పట్టణ, గ్రామీణ, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. రథోత్సవం సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో నరసింహారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా బొమ్మల కొలువులు, గాజుల దుకాణాలు విరివిగా వెలిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వవహించినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
Updated Date - May 27 , 2024 | 11:45 PM