ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RATHOTSAVAM : కన్నుల పండువలా వేణుగోపాలస్వామి రథోత్సవం

ABN, Publish Date - Jul 31 , 2024 | 11:53 PM

మండలంలోని మే రెడ్డిపల్లిలో వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని బుధవా రం కన్నులపండువలా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణులు తమ ఇలవేల్పు అయిన మే రెడ్డిపల్లి వేణుగోపాలస్వామిని అనాదిగా ఆరాధిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో వారు గ్రా మానికి వచ్చి స్వామికి విశేష పూజలు నిర్వహి స్తారు. ఆషాఢమాసం రోహిణి నక్షత్రం రోజున రథోత్సవం నిర్వహించడం అనవాయితీ.

Women carrying urns in Rathotsavam

గోరంట్ల, జూలై 31: మండలంలోని మే రెడ్డిపల్లిలో వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని బుధవా రం కన్నులపండువలా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణులు తమ ఇలవేల్పు అయిన మే రెడ్డిపల్లి వేణుగోపాలస్వామిని అనాదిగా ఆరాధిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో వారు గ్రా మానికి వచ్చి స్వామికి విశేష పూజలు నిర్వహి స్తారు. ఆషాఢమాసం రోహిణి నక్షత్రం రోజున రథోత్సవం నిర్వహించడం అనవాయితీ. ముందురోజు మంగళవా రం ఆలయంలో హోమాలు నిర్వహించి, వేణుగోపాల స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.


అలాగే బుధవారం అర్చకులు మంజు, హరిస్వాములు మూలవిరాట్‌ను అభిషేకించి, ప్రత్యేకంగా అలకరిం చారు. అర్చన, మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం రుక్ష్మిణి, సత్యభామ సమేత ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఉంచి ఊరేగించారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు కలశాలతో రాగా, చౌడేశ్వరీదేవిని పల్లకిలో మోస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. బ్రాహ్మణమహిళలు కోలాటమాడారు. బ్రాహ్మణులు, గ్రామస్థులు కలిసి కట్టుగా రథాన్ని లాగారు. గ్రామంలోని ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 31 , 2024 | 11:53 PM

Advertising
Advertising
<