ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: సైకిల్‌ గుర్తుకు ఓటువేసి గెలిపించండి: అశ్మితరెడ్డి

ABN, Publish Date - May 06 , 2024 | 12:22 AM

సైకిల్‌ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని నందలపాడు, ఆంజనేయస్వామిమాన్యం, పీర్లమాన్యం, గాంధీనగర్‌, పోరాటకాలనీ, పాతకోట, టైలర్స్‌కాలనీ, కాల్వగడ్డవీధి ప్రాంతాల్లో ఆదివారం జేసీ అశ్మితరెడ్డి బహిరంగసభలు నిర్వహించారు.

రోడ్‌షోలో మాట్లాడుతున్న జేసీ అశ్మితరెడ్డి

తాడిపత్రిటౌన, మే 5: సైకిల్‌ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని నందలపాడు, ఆంజనేయస్వామిమాన్యం, పీర్లమాన్యం, గాంధీనగర్‌, పోరాటకాలనీ, పాతకోట, టైలర్స్‌కాలనీ, కాల్వగడ్డవీధి ప్రాంతాల్లో ఆదివారం జేసీ అశ్మితరెడ్డి బహిరంగసభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో తాడిపత్రిలో అభివృద్ధి శూన్యమన్నారు. తాడిపత్రికి పూర్వవైభవం రావాలంటే టీడీపీకి ఓటువేయాలని అభ్యర్థించారు. పీర్లమాన్యం, ఆంజనేయస్వామిమాన్యం, సన్యాసిమఠం ప్రాంతాలకు సంబంధించి ఇంటిపట్టాల విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తాను గెలిచిన వెంటనే సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అండర్‌డ్రైనేజీ నిర్వహణ మునుపటికంటే మెరుగ్గా ఉండేలా చేస్తానన్నారు. సీసీ రోడ్లు లేని కాలనీల్లో తప్పకుండా ఏర్పాటుకు కృషిచేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిసంతకం మెగా డీఎస్సీపై చంద్రబాబునాయుడు చేస్తారన్నారు. తాడిపత్రిలో మూతపడ్డ గ్రానైట్‌, నల్లబండల పరిశ్రమలను తెరిపించి కూలీలకు జీవనోపాధి కల్పిస్తామని తెలిపారు. అభివృద్ధి కావాలంటే టీడీపీకి ఓటు వేయాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. బహిరంగ సభల్లో జనసేన నియోజకవర్గ ఇనచార్జి కదిరి శ్రీకాంతరెడ్డి, కౌన్సిలర్‌ విజ్జి, బీజేపీ నియోజకవర్గ ఇనచార్జి రంగనాథరెడ్డి, ఆంజనేయులు, టీడీపీ సీనియర్‌ నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, ఈశ్వరరెడ్డి, నాగభూషణంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


30కుటుంబాలు టీడీపీలో చేరిక: పట్టణంలోని పప్పూరురోడ్డులో ఉన్న దళితవాడకు చెందిన మాజీ కౌన్సిలర్‌ బాలరాజుతోపాటు 30కుటుంబాలు వైసీపీని వీడి ఆదివారం టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి జేసీ అశ్మితరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. కౌన్సిలర్‌ విజ్జి, ఆదినారాయణరెడ్డి, కుమార్‌రెడ్డి, చిట్టిబాబు, రాజారెడ్డి పాల్గొన్నారు. అలాగే 7వవార్డుకు చెందిన వైసీపీ కౌన్సిలర్‌ గౌసియా ఆదివారం టీడీపీ తీర్థం పుచుకున్నారు. గౌసియాతోపాటు ఆమె భర్త హాజీకి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.


అభివృద్ధి చేసేవారికే ఓటు వేయండి

పెద్దవడుగూరు: అభివృద్ధి చేసేవారికే ఓటు వేయాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని అప్పేచర్ల, కిష్టిపాడు, లక్షుంపల్లి, పెద్దవడుగూరు గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. మండలకేంద్రంలోని ప్రధాన కూడలిలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కన్వీనర్‌ కొండూరు కేశవరెడ్డి, పుట్లూరు లక్ష్మికాంతరెడ్డి, గంగరాజుయాదవ్‌, దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2024 | 12:22 AM

Advertising
Advertising