ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PROTEST : మౌలిక వసతులు కల్పించాకే ఓటు

ABN, Publish Date - May 14 , 2024 | 01:35 AM

మా కాలనీకి తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుత సౌకర్యం కల్పించాకే ఓటు వేస్తాం’ అని మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, కొటిపి పంచాయతీకి చెందిన భరత నగర్‌ కాలనీ వాసులు సోమవారంనిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటే ఇందిరమ్మ, భరతనగర్‌ కాలనీ వాసులు మాత్రం ఎన్నికలను బహిష్కరించారు. తమ కాలనీలకు మౌలిక వసతులు కల్పించాకే ఓటు వేస్తామని ఖరాకండిగా చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆగ్రహించారు.

Colony residents protesting at Indiramma Colony

‘పురం’లో కాలనీ వాసుల నిరసన

హిందూపురం అర్బన, మే 13: ‘మా కాలనీకి తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుత సౌకర్యం కల్పించాకే ఓటు వేస్తాం’ అని మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, కొటిపి పంచాయతీకి చెందిన భరత నగర్‌ కాలనీ వాసులు సోమవారంనిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటే ఇందిరమ్మ, భరతనగర్‌ కాలనీ వాసులు మాత్రం ఎన్నికలను బహిష్కరించారు. తమ కాలనీలకు మౌలిక వసతులు కల్పించాకే ఓటు వేస్తామని ఖరాకండిగా చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆగ్రహించారు. గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గెలిచిన సర్పంచ కానీ, నాయకులు కానీ తమ అతిగతి విచారించిన పాపాన పోలేదని మండిపడ్డారు. కాలనీలకు రోడ్లు సరిగా లేవని గ్యాస్‌ సిలెండర్‌ సరఫరాచేసే వారు కూడా రావడంలేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనం కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. డ్రైన్లు లేక మురుగునీరు ఇళ్ల వద్దే నిలువ ఉండిపోయి రోగాలబారిన పడుతున్నామని అన్నారు. రాత్రి వేళల్లో విద్యుత సరఫరా సరిగాలేక విషపురుగలబారిన పడతామని భయమేస్తుందన్నారు. ప్రతి రోజు దినదిన గండంగా భయంతో బతుకుతున్నామని ఆవేదన చెందారు. ఎన్ని మార్లు తమ పరిస్థితి తెలియజేసినా ఎవరూ పట్టించుకోలోదని వాపోయారు. దీంతో సోమవారం ఎన్నికలు బహిష్కరించి కాలనీలో ధర్నా చేపట్టామన్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం మాజీ సర్పంచ హెచఎన రాము, ఇందిరమ్మ కాలనీ వద్దకు వెళ్లి రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 14 , 2024 | 01:35 AM

Advertising
Advertising