VOTE : క్యూలో బారులు తీరిన ఓటర్లు
ABN, Publish Date - May 14 , 2024 | 01:13 AM
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ప్రతి కేంద్రం వ ద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం దాటిన క్యూ తగ్గలేదు. కొన్ని బూతలలో ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. ధర్మపురం 66వ పోలింగ్ బూతలో వైసీపీ ఏజంట్‌లు ఆలస్యంగా రావడంతో పోలింగ్ ఆ లస్యంగా రావడం, ఈవీఎం సరిగా పని చేయక పో వడంతో ఉదయం 7.26 పోలింగ్ ప్రారంభమైంది. ఆరు గంటల నుంచే క్యూలో నిలబడి న ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.
ఈవీఎం మొరాయించడంతో కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం
పురంలో వర్షంలోనే క్యూలో...
హిందూపురం అర్బన, మే 13: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ప్రతి కేంద్రం వ ద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం దాటిన క్యూ తగ్గలేదు. కొన్ని బూతలలో ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. ధర్మపురం 66వ పోలింగ్ బూతలో వైసీపీ ఏజంట్‌లు ఆలస్యంగా రావడంతో పోలింగ్ ఆ లస్యంగా రావడం, ఈవీఎం సరిగా పని చేయక పో వడంతో ఉదయం 7.26 పోలింగ్ ప్రారంభమైంది. ఆరు గంటల నుంచే క్యూలో నిలబడి న ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం వర్షం కురిసినా గొ డుగులు పట్టుకుని ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు
హిందూపురం : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ దంపతులు హిందూపురం పట్ట ణంలో ఓటు హక్కు వినియోగించుకు న్నారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీ 42వ పోలింగ్ బూతలో నందమూరి బాలకృష్ణ, వసుంధరా దేవి క్యూలో నిలబడి ఓటు వేశారు. హిం దూపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి దీపిక హిం దూపురం మండలం బీరేపల్లి 10వ పోలింగ్ బూతలో ఓటేశారు. మాజీ ఎ మ్మెల్సీ, టీడీపీ నాయకుడు షేక్ మహ్మద్ ఇక్బాల్ పట్టణం లోని చిన్న మార్కెట్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించు కున్నారు.
చిలమత్తూరు: మండలకేంద్రంలోని జడ్పీ పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని హిందూ పురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ సోమవారం సాయంత్రం పరిశీలించారు. పోలింగ్‌కు సంంబంధించి పలు విషయాలను పోలింగ్ అధికారులతో అడిగితెలుసుకున్నారు. పో లింగ్ సమ యం ఉన్నంత వరకు ఓటు వేసేందుకు ఓటర్లకు అవకాశం ఇవ్వాలని అధికారులను కోరారు.
పురంలో సాయంత్రం 7కు 73.32శాతం పోలింగ్
హిందూపురం, మే 13 : నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్‌లో సాయంత్రం 7గంటల సమయానికి 73.32శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7గంటలకే ప్రారంభమైన పోలింగ్ కొన్నిచోట్ల రాత్రి 10గంటలు దాటినా కూడా కొనసాగింది. దీంతో పూర్తీస్థాయి పోలింగ్‌శాతం అధికారులు తెలుపలేకపోయారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2,49,174ఓట్లుండగా ఇందులో పురుషులు 1,24,730, మహిళలు 1,24,425, ఇతరులు 19మంది ఉన్నారు. సాయంత్రం 7గంటల సమయానికి ఎన్నికల అధికారులు తెలిపిన వివరాలనుబట్టి 73.32శాతం నమోదైందని తెలిపారు.
బందోబస్తు మధ్య : పోలింగ్ సందర్భంగా సోమవారం హిందూపురం నియోజకవర్గంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద 144సెక్షన విధించారు. అయితే హిందూపురం మండలం ఎం.బీరేపల్లిలో వైసీపీ అభ్యర్థి స్వగ్రామం అయితే ఇక్కడ ఈవీఎం పలుసార్లు మొరాయించడంతో రాత్రి 10.30 గంటలు దాటేవరకు పోలింగ్ కొనసాగింది. 86.68శాతం పోలింగ్ అయినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 14 , 2024 | 01:13 AM