Road: ఓటేసి... నరకం చూస్తున్నాం
ABN, Publish Date - Apr 22 , 2024 | 12:32 AM
ఆ నాయకుడిది మా పక్క ఊరే. ఆయన భార్యే వైసీపీ తరపున పోటీ చేస్తోంది. పక్క ఊరే కావడంతో మా ఊరి సమస్యలు కూడా తెలిసి ఉంటాయని, పరిష్కరిస్తారని ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాం. ఏళ్లు గడిచినా మా ఊరి సమస్యలు మాత్రం తీరలేదని గోవిందురాయునిపేట ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శింగనమల నుంచి రాచేపల్లికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి గోవిందురాయునిపేటకు అర కిలోమీటర్ దూరం ఉంది.
గోవిందురాయునిపేట ప్రజలు
శింగనమల: ఆ నాయకుడిది మా పక్క ఊరే. ఆయన భార్యే వైసీపీ తరపున పోటీ చేస్తోంది. పక్క ఊరే కావడంతో మా ఊరి సమస్యలు కూడా తెలిసి ఉంటాయని, పరిష్కరిస్తారని ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాం. ఏళ్లు గడిచినా మా ఊరి సమస్యలు మాత్రం తీరలేదని గోవిందురాయునిపేట ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శింగనమల నుంచి రాచేపల్లికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి గోవిందురాయునిపేటకు అర కిలోమీటర్ దూరం ఉంది. ఈ రోడ్డంతా అధ్వానంగా ఉండేది.
2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి గోవిందురాయునిపేటకు వచ్చారు. ‘నేను మీవాణ్ని. నా భార్య జొన్నలగడ్డ పద్మావతికి ఓటు వేసి గెలిపించండి. మీ గ్రామానికి తారు రోడ్డు వేయిస్తా’ అని మాటిచ్చాడు. పద్మావతి గెలిచాక మూడేళ్ల కిందట తారు రోడ్డు నిర్మాణం కోసం పనులకు భూమి పూజ చేశారు. రోడ్డుకు కంకర తొలి వదిలేశారు. ఇప్పటి వరకు రోడ్డు పూర్తి కాలేదు.
గ్రామంలోని వెళ్లాలంటే కంకరపై నడవాల్సిందే. దీంతో ఆ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు నమ్మి ఓట్లు వేశాం..నేడు నడవలేక నరకం చూస్తున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Apr 22 , 2024 | 12:32 AM