TDP ROADSHOW: అభివృద్ధి చూసి ఓటు వేయండి: అశ్మితరెడ్డి
ABN, Publish Date - May 07 , 2024 | 11:50 PM
టీీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటువేయాలని టీడీపీ, కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని వరదాయపల్లి, ధర్మాపురం, పెద్దపప్పూరు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుంచి మండలంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు.
పెద్దపప్పూరు, మే7: టీీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటువేయాలని టీడీపీ, కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని వరదాయపల్లి, ధర్మాపురం, పెద్దపప్పూరు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుంచి మండలంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకిరాగానే వాటిని పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధికి మారుపేరుగా ఉన్న టీడీపీకి ఓటువేసి గెలిపించాలని ప్రజలను ఆయన అభ్యర్థించారు. జనసేన ఇనచార్జి కదిరి శ్రీకాంతరెడ్డి, తెలుగుయువత ఉపాధ్యక్షుడు తాతిరెడ్డి లోకనాథ్‌రెడ్డి, నాయకులు బీసీ రామకృష్ణారెడ్డి, శశిధర్‌రెడ్డి, విష్ణువర్దనరెడ్డి, చిన్న నారాయణస్వామి, వెంకటశివారెడ్డి, నల్లప్ప, కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
కూటమి అభ్యర్థులను గెలిపించండి: కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులైన అంబికా లక్ష్మినారాయణ, జేసీ అశ్మితరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీనేత జేసీ పవనరెడ్డి ప్రజలను అభ్యర్థించారు. మంగళవారం చిట్టూరు, చిత్రచేడు, దిమ్మగుడి, వీరన్నపల్లి, నాగలాపురం, కొండూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాడిపత్రిటౌన: పట్టణంలోని పుట్లూరురోడ్డు, సంజీవనగర్, మారుతీనగర్, రెడ్డివారిపాలెం ప్రాంతాల్లో మంగళవారం కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ప్రచారంలో కాకర్ల రంగనాథ, జయుడు, పాపిరెడ్డి, రంగనాథరెడ్డి, నాయుడు, పవనకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
కాకర్ల బ్రదర్స్‌ప్రచారం: మండలంలోని తేల్లమిట్టపల్లి, యాడికి మండలంలోని నిట్టూరు, కొత్తపల్లి గ్రామాల్లో మంగళవారం టీడీపీ సీనియర్ నాయకులు కాకర్ల రంగనాథ్, కాకర్ల జయుడు, కాకర్ల రంగనాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటువేసి జేసీ అశ్మితరెడ్డిని గెలిపించాలని కోరారు.
40కుటుంబాలు చేరిక: స్థానిక నివాసంలో మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో మండలంలోని భోగసముద్రం, అయ్యవారిపల్లి, గదరగుట్టపల్లి గ్రామాల 40 వైసీపీ కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి జేసీపీఆర్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన సోమేశ్వరరెడ్డి, కనకం ప్రసాద్, భూమేశ్వర్‌రెడ్డి, చంద్రమోహనరెడ్డి, రంగస్వామి ఉన్నారు.
నా కుమారుడిని ఆశీర్వదించండి: జేసీపీఆర్
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న నా కుమారుడు జేసీ అశ్మితరెడ్డిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. మంగళవారం పట్టణంలోని ఆంజనేయస్వామిమాన్యంలో ఆయన ప్రచారం చేశారు.
Updated Date - May 07 , 2024 | 11:50 PM