ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KALAVA CAMPAIN: రెండు పంటలకు నీరందిస్తాం: కాలవ

ABN, Publish Date - May 08 , 2024 | 11:44 PM

టీడీపీ అధికారంలోకి రాగానే ఉంతకల్లు రిజర్వాయర్‌ను పదేళ్లలో నిర్మించి రైతులకు రెండు పంటలకు నీరందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. బుధవారం బొమ్మనహాళ్‌ మండలంలోని హొసళ్లి, వన్నళ్లి, దర్గాహోన్నూరు, గోవిందవాడ, సింగానహళ్లి, గోనేహాళ్‌, కణేకల్లు మండలంలోని బెణెకల్లు, ఉడేగోళం, మారెంపల్లి గ్రామాల్లో కాలవ రోడ్‌షో నిర్వహించారు.

రోడ్‌షోలో మాట్లాడుతున్న కాలవ

బొమ్మనహాళ్‌/కణేకల్లు, మే 8: టీడీపీ అధికారంలోకి రాగానే ఉంతకల్లు రిజర్వాయర్‌ను పదేళ్లలో నిర్మించి రైతులకు రెండు పంటలకు నీరందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. బుధవారం బొమ్మనహాళ్‌ మండలంలోని హొసళ్లి, వన్నళ్లి, దర్గాహోన్నూరు, గోవిందవాడ, సింగానహళ్లి, గోనేహాళ్‌, కణేకల్లు మండలంలోని బెణెకల్లు, ఉడేగోళం, మారెంపల్లి గ్రామాల్లో కాలవ రోడ్‌షో నిర్వహించారు. గ్రామాలలో భారీ స్పందన వచ్చింది. ప్రజలు నీరాజనం పలికారు. బెణెకల్లులో తాగునీటి సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి తాగునీటి కొళాయిని అందిస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకపోతే రాషా్ట్రన్ని ఎవరూ కాపాడలేరు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా రైతుల భూములు కబ్జా చేస్తారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ యాక్ట్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


వైసీపీ మాజీ ఎంపీటీసీ టీడీపీలోకి చేరిక: దర్గాహోన్నూరు, గోనేహాళ్‌ గ్రామాల నుంచి క్లస్టర్‌ కన్వీనర్‌ కేశవరెడ్డి, మాజీ జడ్పీటీసీ వాణిజగన్నాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ కేశప్ప ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు సమక్షంలో భారీగా టీడీపీలో చేరారు. వైసీపీ మాజీ ఎంపీటీసీ రమేష్‌, వార్డు మెంబర్‌ అడివప్పలతో పాటు 30 కుటుంబాల వారికి కాలవ టీడీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు కొళగానహళ్లి, కళ్లుహోళ గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు చేరారు.


20 కుటుంబాలు చేరిక: గుమ్మఘట్ట మండలం పూలకుంట గ్రామంలో బుధవారం వడ్డే సామాజిక వర్గానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీ వీడి టీడీపీలో చేరాయి. కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత ఆధ్వర్యంలో వారు టీడీపీ కండువాలు వేసుకున్నారు. చేరిన వారిలో వడ్డే గంగన్న, రామాంజి ఉన్నారు.

కుటుంబికుల ప్రచారం: కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు సతీమణి బొమ్మనహాళ్‌ మండలం ఉప్పరహాళ్‌, గౌనూరు, కూతురు కాలవ గౌతమి కణేకల్లు మండలం హనకనహాళ్‌ గ్రామాలలో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Updated Date - May 08 , 2024 | 11:44 PM

Advertising
Advertising