ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

COMMISSIONER: నిరంతరాయంగా తాగునీటిని అందిస్తాం

ABN, Publish Date - Jul 19 , 2024 | 11:46 PM

తాగునీటి పథకాల ద్వారా అంతరా యం లేకుండా తాగునీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలిక కమిషనర్‌ మేఘస్వరూప్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకం, ఆర్‌డబ్ల్యూఎస్‌ పథకాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Speaking Commissioner

అనంతపురం టౌన, జూలై 19: తాగునీటి పథకాల ద్వారా అంతరా యం లేకుండా తాగునీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలిక కమిషనర్‌ మేఘస్వరూప్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకం, ఆర్‌డబ్ల్యూఎస్‌ పథకాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటిపథకాల అమలు, అక్కడ నెలకొన్న సమస్యల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాగునీటి పథకాల అమలులో ఎన్ని సమస్యలున్నా వాటిని అధిగమిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీటిని సరఫరా చేయాల్సిందేనని అధికారులకు ఆదేశించారు. ఆయా పథకాల కింద పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కార్మిక సంఘాల నేతలతో చర్చించి, అందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈకి సూ చించారు. వర్కర్ల జీతాల సమస్యకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆలోచించాలన్నారు. సమీక్షలో ఆర్‌డబ్యుఎస్‌ ఎస్‌ఈ హుసేన బాషా, జడ్పీ డిప్యూటీ సీఈఓ లలితాబాయి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2024 | 11:46 PM

Advertising
Advertising
<