ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YCP LEADERS: ‘మాలగుండ్ల’ను అడ్డుకుంటాం

ABN, Publish Date - Nov 16 , 2024 | 11:49 PM

మండలంలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ గోరంట్లకు వస్తే వైసీపీ నాయకులే అడ్డుకుంటారని మాజీ సింగల్‌విండో అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు గంపల రమణారెడ్డి హె చ్చరించారు.

మాట్లాడుతున్న ఉష శ్రీచరణ్‌ వర్గీయులు

గోరంట్ల, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): మండలంలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ గోరంట్లకు వస్తే వైసీపీ నాయకులే అడ్డుకుంటారని మాజీ సింగల్‌విండో అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు గంపల రమణారెడ్డి హె చ్చరించారు. టీడీపీ కార్యకర్త రంగప్ప ఇంటిపై దాడిచేసిన వానవోలు ఉప సర్పంచ కుటాల బాబు, శ్రీనివాసులును విడిపించడానికి శంకరనారాయణ రెండురోజుల కిందట గోరంట్ల పోలీస్‌ స్టేషనకు తన వర్గీయులతో వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్‌ వర్గీయులు గోరంట్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశంలో స్పందించారు. పార్టీ కోసం పనిచేయడానికి వస్తే స్వాగతిస్తామని, మామధ్య చిచ్చుపెట్టాలని చూస్తూ సహించేదిలేదని రమణారెడ్డి తెలిపారు. పార్టీ కార్యక్రమాలు చేసే సమయంలో స్థానిక, పట్టణ, మండల కన్వీనర్లు తదితర ప్రముఖులు, జిల్లా అధ్యక్షులకు తెలిపితే కలిసి వస్తామని కన్వీనర్‌ వీరనారాయణరెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి తాము అందరిని ఆహ్వానించినా, శంకరనారాయణ వర్గం రాలేదన్నారు. పదేళ్లపాటు మీకోసం పార్టీ జెండా మోశాం. గ్రూపు రాజకీయాలు చేస్తూ, మాకు చెప్పకుండా దొంగలా వచ్చి పోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. వెన్నుపోటు రాజకీయాలు మాని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేయాలని ఉప సర్పంచ రాజారెడ్డి హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో మీకు టిక్కెట్‌ కేటాయించినా, పార్టీ ఆదేశానుసారం పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ఫ కాగా దాడికేసులో నిందితుడైన వానవోలు ఉప సర్పంచ కుటాల బాబు పార్టీ స్పందనతో సోషల్‌ మీడియా ద్వారా తన సందే శాన్ని ప్రకటించారు. తాను కూడ వైసీపీలోనే పనిచేస్తున్నానని, మీరు శంకరనారాయణను అడ్డుకుంటే, తాముకూడా ఉష శ్రీచరణ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Nov 16 , 2024 | 11:50 PM