ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AMILINENI: కళ్యాణదుర్గం ప్రజల కలలను నెరవేర్చుతాం

ABN, Publish Date - May 07 , 2024 | 11:40 PM

కళ్యాణదుర్గం ప్రజల కలలను నెరవేర్చడమే తన మొదటి కర్తవ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారితో అమిలినేని సురేంద్ర బాబు

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని

కళ్యాణదుర్గం, మే 7: కళ్యాణదుర్గం ప్రజల కలలను నెరవేర్చడమే తన మొదటి కర్తవ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరారు. బ్రహ్మసముద్రం మండలం భైరవానటిప్పకు చెందిన 11, కళ్యాణదుర్గం మండలం సిబాయి గ్రామానికి చెందిన 13, శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన పది, కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామానికి చెందిన పది వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరాయి వీరందరికీ అమిలినేని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.


అమిలినేని మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతూ అపూర్వ స్వాగతం పలుకుతున్నారన్నారు. ప్రతి గ్రామంలోను టీడీపీకు ప్రజాబలం పరుగుతోందన్నారు. టీడీపీ వస్తేనే గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయనే నమ్మకం ప్రజల్లో బలంగా వినిపిస్తోందన్నారు. ఈ ప్రజాదరణ చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కళ్యాణదుర్గం అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఎక్కడ చూసినా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారే కనిపిస్తున్నారన్నారు. ప్రజల నుంచి వస్తున్న విమర్శలు చూస్తే నియోజకవర్గంలో వైసీపీ పరిపాలన ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు.


నియోజవకర్గంలో టీడీపీకి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. మున్సిపాలిటీ అంతా దుర్గంధమయంగా మారిందన్నారు. మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది ఆదాయ వనరుగా మార్చడమే తన ప్రధాన ధ్యేయమన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. కుటుంబానికి ఆర్థిక భద్రతతో పాటు భావితరాల భవిష్యత్తు అభివృద్ధి పథంలో వుండాలంటే విజన వున్న నాయకుడు చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. అందుకోసమే మనమందరం సమష్టిగా కృషిచేసి చంద్రబాబునాయుడును సీఎంగా చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిని ఆలోచించి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అప్పుడే మన ఊరు మన ప్రాంతం బాగుపడుతుందన్నారు. 13వ తేదీన ప్రతి ఓటరూ టీడీపీకి ఓటువేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 11:40 PM

Advertising
Advertising