ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పేరూరు ప్రాజెక్టుకు నీరు తీసుకొస్తాం

ABN, Publish Date - Mar 24 , 2024 | 11:35 PM

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పేరూరు ప్రాజెక్టుకు ఖచ్చితంగా నీరు తీసుకువస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

శివపురంలో ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత

ధర్మవరంరూరల్‌, మార్చి 24 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పేరూరు ప్రాజెక్టుకు ఖచ్చితంగా నీరు తీసుకువస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కనగానపల్లి మండలంలోని కేఎనపాళ్యం, శివపురం, శివపురం కొట్టాల, మద్దలచెరువు, వేపకుంట, మద్దలచెరువు తండా, కొండపల్లి తదితర గ్రామాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఆమె మాట్లాడుతూ.... రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అసమర్థత వల్లే పేరూరు ప్రాజెక్టుకు నీరు అందలేదని విమర్శించారు. గతంలో తాము మొదలు పెట్టిన ప్రాజెక్టులను ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. కనీసం రైతులకు పరిహారం కూడా ఇచ్చినా దాఖాలాలు లేవన్నారు. కర్ణాటక నుంచి నీరు తెచ్చామని గొప్పలు చెబుకుంటూ ఐదేళ్లు కాలం గడిపారన్నారు. కనీసం వర్షానికి డ్యాం నిండితే ఆ నీటిని కూడా రైతులకు సక్రమంగా అందించలేని దుస్థితిలో వైసీపీ పాలన ఉందని విమర్శించారు. పేరూరు ప్రాజెక్టుకు నీరు అందించే క్రమంలో భూ ములు ఇచ్చిన రైతులందరికి ప్రస్తుత ధర ప్రకారం ఖచ్చితంగా చెల్లి స్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేష్‌, కన్వీనర్‌ యాతంపోతలయ్య, సుధాకర్‌ చౌదరి, తెలుగుయువత బట్టాసురేష్‌చౌదరి, ప్రభాకర్‌ నాయుడు, చండ్రాయుడు, ఎంపీటీసీ బిల్లేభాస్కర్‌, రా మాంజి, బోదులస్వాతి, నాగా ర్జున, తలారి రాజప్ప, బిల్లేదాము పాల్గొన్నారు. వేపకుంట గ్రామంలో వైసీపీ నుంచి 10 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. కొండపల్లిలో పది కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి.

Updated Date - Mar 24 , 2024 | 11:35 PM

Advertising
Advertising