farmers రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:03 AM
వర్షానికి మండలంలో వరి పంటలు దెబ్బతిన్నాయని, జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధిత రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే సోదరి బండారు కిన్నెర హామీ ఇచ్చారు. మండలకేంద్రంలోని నేలకొరిగిన వరిపొలాలను, తడిసిన ధాన్యాన్ని శుక్రవారం ఆమె స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
యల్లనూరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): వర్షానికి మండలంలో వరి పంటలు దెబ్బతిన్నాయని, జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధిత రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే సోదరి బండారు కిన్నెర హామీ ఇచ్చారు. మండలకేంద్రంలోని నేలకొరిగిన వరిపొలాలను, తడిసిన ధాన్యాన్ని శుక్రవారం ఆమె స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టవివరాలను నమోదు చేయాలని వ్యవసాయ అధికారి రామకృష్ణకు సూచించారు. వ్యవసాయ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు రైతులకు అందుబాటులో ఉంచాలని డిప్యూటి తహసీల్దార్ రాజాకు తెలిపారు. అధికారులు పంటనష్ట వివరాలు అందించిన వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని అన్నారు. నివేదికల ఆధారంగా ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఆమె వెంట టీడీపీ మండల కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు దొడ్లో సుబ్బరాయుడు, మేడికుర్తి రామకృష్ణారెడ్డి, జంగంపల్లి సర్పంచు కుళ్లాయప్పనాయుడు, వెన్నపూసపల్లి భైరవేశ్వర్, చింతకాయమంద డిష్‌రాముడు, తిరుమలాపురం దస్తగిరి ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Nov 16 , 2024 | 01:03 AM