PUTTAPARTI : హిమాచల్ప్రదేశ గవర్నర్కు ఘనస్వాగతం
ABN, Publish Date - Jul 20 , 2024 | 11:54 PM
హిమాచల్ప్రదేశ గవర్నర్ శివప్రసాద్శుక్ల శనివారం రాత్రి బెంగళూరు నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి రాత్రి 10.40గంటకు ప్రశాంతినియలంలోని శాంతిభవనకు చేరుకున్నారు. ఈసందర్బంగా జిల్లా కలెక్టరు టీఎస్ చేతన, ఎస్పీ వి రత్న, అడిషనల్ ఎస్పీ విష్ణు, ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ఆర్డీఓ భాగ్యరేఖ ఆయనకు పుష్ఫగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు.
పుట్టపర్తి, జూలై 20 : హిమాచల్ప్రదేశ గవర్నర్ శివప్రసాద్శుక్ల శనివారం రాత్రి బెంగళూరు నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి రాత్రి 10.40గంటకు ప్రశాంతినియలంలోని శాంతిభవనకు చేరుకున్నారు. ఈసందర్బంగా జిల్లా కలెక్టరు టీఎస్ చేతన, ఎస్పీ వి రత్న, అడిషనల్ ఎస్పీ విష్ణు, ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ఆర్డీఓ భాగ్యరేఖ ఆయనకు పుష్ఫగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. ప్రశాంతినిలయంలో ఆదివారం జరిగే గురుపూర్ణిమ వేడుకల్లో హిమాచల్ప్రదేశ గవర్నర్ పాల్గొననున్నారు.
ఘనంగా శ్రీగిరి ప్రదక్షిణ
పుట్టపర్తి: సత్యసాయి శ్రీగిరి ప్రదక్షిణను శనివారం ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ప్రశాంతినిలయం గణేష్ గేట్ వద్ద సత్య సాయి రఽథానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. సత్యసాయి భక్తి గీతాలు అలపిస్తూ రధాన్ని లాగుతూ గిరిప్రదక్షిణ నిర్వహిం చారు. గోకులం, గణేష్ కూడలి, పెట్రోలు బంకు, చింతతోపు, గోవిందపేట, శివాలయం వీధి, సత్యమ్మఅలయం, గోపురంమీదుగా తిరిగి గణేష్ వద్దకు చేరింది. మహా మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 20 , 2024 | 11:54 PM