MINISTER SATYA KUMAR: ఆరోగ్య మంత్రికి ఘన స్వాగతం
ABN, Publish Date - Jun 19 , 2024 | 12:08 AM
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం లభించింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అనంతపురం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు గొంది అశోక్ కుమార్, రావి చైతన్య కిషోర్ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మంగళవారం ఘనంగా సత్కరించారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర
మంత్రి హోదాలో జిల్లాకు తొలిసారి సత్యకుమార్ యాదవ్
ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
అనంతపురం సెంట్రల్, జూన 18: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం లభించింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అనంతపురం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు గొంది అశోక్ కుమార్, రావి చైతన్య కిషోర్ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మంగళవారం ఘనంగా సత్కరించారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాకే శివశంకర్, జిల్లా అధ్యక్షుడు ప్రభుకుమార్, రాష్ట్ర కార్యవర్గ
సభ్యుడు మందల శాంతకుమార్ గజమాలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌తో కలిసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ, బాణసంచా పేల్చుతూ అభిమానాన్ని చాటుకున్నారు.
ఉద్యోగులు, సిబ్బందికి స్వేచ్ఛ..
ఐదేళ్ల వైసీపీ పాలనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వైద్య, ఆరోగ్య శాఖలోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది మంత్రి సత్యకుమార్ యాదవ్ ముందు వాపోయారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి నివాసంలో వారు మంత్రిని కలిశారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కల్పించలేదని, టీఏ, డీఏ వంటివి కూడా ఇవ్వకుండా వేధించారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియామకాలు, ఉద్యోగోన్నతులు, విధుల కేటాయింపు.. ఇలా అన్నింటిలోనూ వైసీపీ నాయకుల
సిఫార్సులకే పెద్ద పీట వేశారని, అర్హులకు అన్యాయం చేశారని అన్నారు. పారిశుధ్య నిర్వహణ నిధులను కూడా మింగేసి కార్మికులను వేధించారని అన్నారు. దీంతో స్పందించిన మంత్రి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు, సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉండవని హామీ ఇచ్చారు. స్వేచ్ఛగా విధులు నిర్వహించే వాతావరణాన్ని కల్పిస్తామని అన్నారు. ఏపీఎంసీఏ నాయకులు నిరంజన, సందీప్, హరికృష్ణ, గణేష్, సువర్ణ, దీప్తి తదితరులు మంత్రిని కలిసినవారిలో ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 19 , 2024 | 12:08 AM