ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dwama : ఏంటో ఈ సిత్రం !

ABN, Publish Date - Aug 14 , 2024 | 12:46 AM

జిల్లాలోని డ్వామా విభాగంలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీల్డ్‌లో పనిచేయాల్సిన ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని డ్వామా పీడీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. కానీ జీతాలు మాత్రం ఆయా మండలాల్లో తీసుకుంటు న్నారు. బదిలీలు చేసిన వారు వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లరు. సుమారు 30మంది కి పైగా ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు పీడీ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా ఇలాగే ఉంది. అలా పని చేస్తు...

Dwama PD Office

ఉద్యోగం ఒక చోట...జీతం మరోచోట

బదిలీ చేసినా విధుల్లో చేరని ఏపీఓలు

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌

డ్వామాలో విచిత్రాలు

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 13: జిల్లాలోని డ్వామా విభాగంలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీల్డ్‌లో పనిచేయాల్సిన ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని డ్వామా పీడీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. కానీ జీతాలు మాత్రం ఆయా మండలాల్లో తీసుకుంటు న్నారు. బదిలీలు చేసిన వారు వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లరు. సుమారు 30మంది కి పైగా ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు పీడీ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా ఇలాగే ఉంది. అలా పని చేస్తున్న ఉద్యో గులందరినీ ఫీల్డ్‌కు పంపమని జిల్లా కలెక్టర్‌ ఇటీవల జారీ చేసిన ఆదేశాలు అమలు కావడం లేదు. దీంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 10గంటల కు హాజరుకావాల్సిన ఉద్యోగులు 11 గంటల తరువాత వస్తున్నా అడిగేవారే లేరు. కాగా ఇటీవల జిల్లా కలెక్టర్‌ బదిలీ చేసిన ఎనిమిది మంది ఏపీఓల్లో ఆరుగురు ఇంతవరకు విధుల్లో చేరకపోవడం గమనార్హం.


పీడీ కార్యాలయంలో ఫీల్డ్‌ ఉద్యోగులు

ఫీల్డ్‌లో పనిచేయాల్సిన దాదాపు 30 మందికి పైగా సిబ్బంది పీడీ కార్యాలయంలో తిష్టవేశా రు. ఇందులో టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఏపీఓలు, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లు (ఈసీ), కంప్యూటర్‌ ఆపరేటర్లు ఉన్నారు. టెక్నికల్‌ అసిస్టెంట్లలో... పరమేష్‌ (బుక్కరాయసముద్రం), సురేంద్ర (నార్పల), రవీంద్ర (రాప్తాడు), రఘునాథ్‌రెడ్డి (గార్లదిన్నె), ఖాజా (గుత్తి), దేవరాజ్‌ (రాయదుర్గం), మల్లి కార్జున (రాయదుర్గం), విజయ్‌కుమార్‌ (కళ్యాణదుర్గం)లు పీడీ కార్యాలయంలో ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. ఈసీలలో ఈశ్వరయ్య (కూడేరు), సాయికిశోర్‌ (కంబదూరు) ఉన్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్లలో హనుమంతరెడ్డి (అనంతపురం రూరల్‌), లలితాదేవి (బుక్కరాయసముద్రం), ఇల్లూరుబాషా (బుక్కరాయ సముద్రం), రమణయ్య (గార్లదిన్నె), సాహల్‌ హమీద్‌ (గుత్తి), సురేంద్ర (గుత్తి), అర్జున (కణేకల్లు), దాదాఖలందర్‌ (కణేకల్లు), గోపిలత (కూడేరు), గీతావాణి (కూడేరు), నాగమణి (నార్పల), రామచంద్రనాయుడు (నార్పల), ఇర్ఫానాబ్బాసి (నార్పల), సహ్రాబీ (పామిడి), వరలక్ష్మి (పామిడి), హెచఆర్‌ శ్రీనివాసులు (పెద్దవడుగూరు), సందీ్‌పరెడ్డి (రాప్తాడు మాజీ ఎమ్మెల్యే పీఏ) పీడీ కార్యాలయంలో పనిస్తున్నారు. వీరంతా మండలాల్లో జీతాలు తీసుకుంటూ...జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.

విధుల్లో చేరని ఏపీఓలు

జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఇటీవల ఎనిమిది మంది ఏపీఓలను బదిలీ చేశారు. వారిలో పుట్లూరు ఏపీఓ భాగ్యలక్ష్మిని బొమ్మనహాళ్‌కు, ఆత్మకూరు ఏపీఓ పుష్పావతి ని కళ్యాణదుర్గానికి, పీడీ కార్యాలయంలో డిప్యుటేషనపై ఉన్న ఆదినారాయణమ్మని తాడిపత్రికి, రాప్తాడు ఏపీఓ ఓబన్నను డీ హీరేహాళ్‌కు బదిలీ చేశారు. అలాగే కూడేరు ఏపీఓ సుజాతను కంబదూరుకు, గార్లదిన్నె ఏపీఓ మురళీకృష్ణను బెళుగుప్పకు, తాడిపత్రి ఏపీఓ రాజ్యలక్ష్మిని బ్రహ్మసముద్రానికి, పామిడి ఏపీఓ విజయభారతిని రాయదుర్గానికి బదిలీ చేశారు. వారెవరూ విధుల్లో చేరలేదు. వీరిలో ఇద్దరు డ్వామా పీడీ కార్యాలయంలోనే పనిచేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 14 , 2024 | 12:46 AM

Advertising
Advertising
<