ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rural roads : పల్లె దారి మారేనా..!

ABN, Publish Date - Aug 09 , 2024 | 12:06 AM

వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి. గ్రామీణ రోడ్ల మరమ్మతులకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. విపక్ష నాయకులు, ప్రజలు ప్రశ్నించినా ఐదేళ్లపాటు పట్టించుకోలేదు. ప్రజలకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక రోడ్లు బాగుపడతాయని జనం భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌ అభివృద్ధి అంశాలపై కసరత్తు మొదలెట్టారు. గ్రామీణ రోడ్ల ...

The road from Bommanhal to Elanji and Mylapuram is like this..

ఐదేళ్ల వైసీపీ పాలనలో ధ్వంసం

మరమ్మతులకు పైసా ఇవ్వని వైనం

టీడీపీ కూటమి ప్రభుత్వం

ప్రత్యేక శ్రద్ధ రూ.172.59 కోట్ల అంచనాలతో నివేదిక

అనంతపురం సిటీ, ఆగస్టు 8: వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి. గ్రామీణ రోడ్ల మరమ్మతులకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. విపక్ష నాయకులు, ప్రజలు ప్రశ్నించినా ఐదేళ్లపాటు పట్టించుకోలేదు. ప్రజలకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక రోడ్లు బాగుపడతాయని జనం భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్‌ అభివృద్ధి అంశాలపై కసరత్తు మొదలెట్టారు. గ్రామీణ రోడ్ల పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మరమ్మతుల కోసం నివేదికలు అందజేయాలని పంచాయతీ రాజ్‌శాఖను ఆదేశించారు. ఆ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా పూర్తిగా దెబ్బతిన్న 173 రోడ్ల మరమ్మతులకు రూ.172.59 కోట్లు అవసరమని అంచనా నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. నిధులు మంజూరు అయితే


ప్రజలకు కష్టాలు తీరుతాయి. త్వరలోనే నిధులు వస్తాయని భావిస్తున్నారు.

ఇంత అధ్వానమా..?

వైసీపీ ఐదేళ్లలో పాలనలో బటన నొక్కుడు తప్ప జనం సమస్యల గురించి పట్టించుకోలేదు. ఫలితంగా గుంతలమయమైన రహదారుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదాల బారిన పడ్డారు. వాహనాలు దెబ్బతిని ఆర్థికంగానూ నష్టపోయారు. ప్రధానంగా ఉరవకొండ, గుంతకల్లు, కళ్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల పరిధిలో గ్రామీణ రహదారులు అత్యంత అధ్వారంగా మారాయి. అధికారుల నివేదికలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

నివేదిక పంపాం..

అసెంబ్లీ సమావేశాలలో గ్రామీణ రోడ్ల మరమ్మతుల విషయమై చర్చ సాగింది. ఈ నేపథ్యంలో రోడ్ల పరిస్థితిని తెలియజేస్తూ ప్రభుత్వానికి నివేదికను అందజేశాం. మరమ్మతులకు తగిన నిధులను కేటాయించాలని కోరాము.

- కేవీ ప్రసాద్‌, పీఆర్‌ ఎస్‌ఈ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 09 , 2024 | 12:06 AM

Advertising
Advertising
<