డబ్బులేకనే.. పింఛన్ల పంపిణీ జరగలేదు
ABN, Publish Date - Apr 02 , 2024 | 12:14 AM
పుట్టపర్తి, ఏప్రిల్ 1: పెన్షన సొమ్ముతో పా టు ప్రభుత్వ నిధులు రూ. 13వేల కోట్లను గ త మార్చినెలలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సీఎం జగనరెడ్డి తన సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు.
- పింఛన్ల సొమ్మును సీఎం తన కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు
- మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తి, ఏప్రిల్ 1: పెన్షన సొమ్ముతో పా టు ప్రభుత్వ నిధులు రూ. 13వేల కోట్లను గ త మార్చినెలలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సీఎం జగనరెడ్డి తన సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. పట్టణంలోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన ప్ర భుత్వ సొమ్మును తన కాంట్రాక్టర్లకు అప్పనం గా పంచిపెట్టారని మండి పడ్డారు. ఈనెల 1వ తేదీన లబ్ధిదారులకు పింఛన రాకపోవడాని కి కారణం జగనరెడ్డి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసినందుకేనన్నారు. సీఎం స్వార్థ రాజకీయాల వలన పింఛన దారులు, వలంటీర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు నాలుగువేలు పింఛన అందిస్తామని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ ఏప్రెల్ 1న జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలకు ఇవ్వాల్సి డబ్బులను సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంతో ఖజానా ఖాళీ అయిందని, అందువల్లే పింఛన్లు పంపిణీ చేయలేకపోతున్నారని తెలిపారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలకు కేరాఫ్ వైసీపీని, ఎన్నికల్లో ప్రజలు ఓటుద్వారా ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పల్లె కోరారు.
Updated Date - Apr 02 , 2024 | 12:14 AM