Collector : రైతుల సంక్షేమం కోసం పనిచేయండి
ABN, Publish Date - Jun 08 , 2024 | 12:21 AM
కరువు జిల్లాగా పేరున్న అనంతలో రైతుల సంక్షేమం కోసం ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. వర్షాలు, పంటలు, విత్తన సరఫరా గురించి తెలుసుకున్నారు. వేరుశనగ విత్తనాన్ని అడిగిన ప్రతి రైతుకూ అందించాలని సూచించారు. పచ్చిరొట్ట, అంతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాకు అవసరమైన విత్తనాల ...
అనంతపురం టౌన, జూన 7: కరువు జిల్లాగా పేరున్న అనంతలో రైతుల సంక్షేమం కోసం ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. వర్షాలు, పంటలు, విత్తన సరఫరా గురించి తెలుసుకున్నారు. వేరుశనగ విత్తనాన్ని అడిగిన ప్రతి రైతుకూ అందించాలని సూచించారు. పచ్చిరొట్ట, అంతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాకు అవసరమైన విత్తనాల వివరాలను వ్యవసాయశాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లి
తెప్పించుకోవాలని అన్నారు. అంతర పంటల సరళిని అధ్యయనం చేయాలని, లాభదాయకమైన పంటలను సాగుచేసేలా రైతులలకు సూచనలు ఇవ్వాలని సూచించారు. రైతులకు కొత్త ఆంశాలపై అవగాహన పెంచడానికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కె-6తోపాటు గుజరాత గిరినార్-4, 5 రకాల వేరుశనగ సాగును ప్రోత్సహించాలని ఆదేశించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, రేకులకుంట, కదిరి శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 08 , 2024 | 12:21 AM